ఇతను ఎవరో గుర్తు పట్టరా…2016 లో వీడియో ఇది. మొన్నటి వరకు చెట్టుకింద ప్లీడర్… పొన్నవోలుసుధాకర్ రెడ్డి… ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యాయవాది. గంగా జలాన్ని నాసిక్ లో పారించిన మేధావి. pic.twitter.com/V0WTYvBXbW
— Sudhakar America 🇮🇳🇺🇸 #NRI-TDPCouncil_Member (@turagasudhakar) September 16, 2023
పొన్నవోలు సుధాకర్‌రెడ్డి. నిన్న మొన్నటి వరకు కూడా ఈ పేరు పెద్దగా ఎవరికీ పరిచయం లేదు. అసలు ఎవరో కూడా తెలియదు. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, అనంతరం ఆయన రిమాండ్ ఘటనల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేరు మార్మోగుతోంది. ఏపీ ప్రభుత్వానికి అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా ఉన్న పొన్నవోలు చంద్రబాబు కేసుపై తరచుగా మీడియా ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఇతర చానెళ్లకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తూ..చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
దీంతో పొన్నవోలు వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. అయితే.. ఈయనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 2016 సంవత్సరంలో స్వయంగా తీసుకున్నట్టుగా ఉన్న సెల్ఫీ వీడియోలో చిందులు వేస్తూ.. పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కనిపించారు. అప్పటికి ఆయన సాధారణ లాయర్‌గా జీవితాన్ని ప్రారంభించినట్టు తెలుస్తోంది. అంటే ఒకరకంగా.. చెట్టు కింద ప్లీడర్ టైపన్నమాట. ఫ్యాంటు, షర్టు టక్ చేసుకుని ఉన్న పొన్నవోలు.. డ్యాన్స్ చేస్తూ.. ఈ వీడియోలో కనిపించారు.
ఇక, ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తిగా స్పందించారు. నిజంగా ఆయననేనా.. ఆనవాలు పట్టలేక పోతున్నామే! అని ఒకరు కామెంటు చేయగా, మరొకొందరు కొంత పరుషంగా వ్యాఖ్యానించారు. మొత్తానికి పొన్నవోలు ఓల్డ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుండడం గమనార్హం.
యాంకర్ అడిగిన సమాధానం చెప్పని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అదనపు అడ్వకేట్ జనరల్ – AP#WeWillGiveitBack#PeopleWithNaidu#FalseCasesAgainstNaidu#SelfGoalByJagan#WeStandWithCBN#CBNWillBeBackWithABang#PonnavoluSudhakarReddy pic.twitter.com/SuS4LuHW6B
— Ramu Thondepu (@ramuthondepu) September 12, 2023
ఇతని పేరు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ప్రభుత్వం తరఫున హైకోర్టులో అదనపు అడ్వకేట్ జనరల్ గా పని చేస్తూ… నిస్సిగ్గుగా నేను ప్రభుత్వం తరపున కాదు జగన్ తరుపున పనిచేస్తాను అని చెబుతున్నాడు ఈ వీడియోని ప్రజలలోనికి మాక్సిమమ్ ప్రచారం చెయ్యాలి👍 pic.twitter.com/cds7aST8Vy
— శివుడు-𝐍𝐂𝐁𝐍 (@Shiva4TDP) September 15, 2023