పోలవరం ఓట్లు రాలుస్తుందా అంటే అవును అనే చెప్పాలి. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలలోని రైతాంగానికి పోలవరం నిజంగా వరమే. దీంతో వారంతా ఏ పార్టీ కాలంలో పోలవరం పూర్తి అయితే దాని వైపే ఎక్కువుగా ఉంటారు. కనీసం ఒక ఎన్నిక వరకైనా మద్దతు ఇస్తారు. అందుకే అన్ని పార్టీలు పోలవరం చుట్టూ తిరుగుతున్నాయి. ఆ నామ జపం చేస్తున్నాయి.
ఇక పోలవరం అన్నది జాతీయ ప్రాజెక్టు. దీనికి కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది. అయితే దాన్ని నిర్వహణ బాధ్యతలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. చంద్రబాబే ఇలా చేశారు. తాను దగ్గరుండి పోలవరం పూర్తి అయ్యేలా చూస్తాను అని హామీ ఇచ్చి మరీ రంగంలోకి దిగారు.
ఇక పోలవరం విషయంలో బాబు ఇంతటి శ్రద్ధాసక్తులు చూపించడంతోనే బీజేపీలోని రాజకీయ పార్టీ నిద్ర లేచింది. చాలా వేగంగాా పనులు చేస్తున్న చంద్రబాబును కట్టడి చేయడానికి పోలవరం విషయంలో కేంద్రం నాన్చుతూ రావడం మొదలైంది. ఎన్ని రకాలుగా కొర్రీలు వేయాలో అన్నీ వేస్తూ వచ్చారు.
ఇక చంద్రబాబు హయాంలో పోలవరం పూర్తి అయితే ఎక్కడ ఆయనకు క్రెడిట్ దక్కుతుందో అని నాడు విపక్ష నేత జగన్ కూడా పోలవరం ప్రాజెక్టులో అవినీతి అంటూ గట్టిగా మాట్లాడారు, మొత్తానికి ఇవన్నీ కలసి కేంద్రంలో అధికారం చలాయిస్తున్న బీజేపీకే మేలు చేశాయి. ఎప్పుడు అయితే చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారో ఆ తర్వాత బీజేపీ నేతలు కూడా పోలవరం చంద్రబాబుకు ఏటీఎం అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
మొత్తానికి సవరించిన అంచనాలు పట్టుబట్టి ఆమోదం చేయించుకున్నారు చంద్రబాబు. ఏపీకి నిధులివ్వడం ఇష్టంలేని బీజేపీ చంద్రబాబుకు పొగ బెట్టింది. అలా ఆగింది పోలవరం. ఇపుడు జగన్ అధికారంలో ఉన్నారు. కేంద్రంలో బీజేపీ ఉంది. మరి మామీద ప్రాజెక్టు కడుతుంటే నిందలు వేశారు. 2 సంవత్సరాల్లో ప్రాజెక్టు ఎంత కట్టారో చెప్పండి అని చంద్రబాబు నిలదీస్తున్నారు.