రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ రాటుదేలారు. అయితే, తను విజయాలు సాధించడానికి అతను ఎన్నుకున్న దారులే దుర్మార్గంగా ఉంటున్నాయన్న అపవాదు ఉంది. ఎలా గెలిచాం అన్నది కాదన్నయ్యా గెలిచామా ? లేదా? అన్నదే ముఖ్యం అంటున్నారు ప్రశాంత్ కిషోర్.
2019 ఎన్నికల్లో కుల రాజకీయాలతో జగన్ ని సీఎం చేసిన జగన్ మళ్లీ అతనికి ప్రమాదం ముంచుకొస్తోందని, ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని జగన్ ఆహ్వానంతో మళ్లీ రంగంలో దిగాడు. అయితే, ఇంతలో తన చెల్లి షర్మిల కోసం కూడా పనిచేయాలని అన్న రెకమెండేషన్ తో షర్మిలకు కూడా జగన్ ఓకే చెప్పారు.
ఒకవైపు తాను కాంగ్రెస్ తరఫున జాతీయ స్థాయిలో పనిచేస్తూ ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేయడం పీకే టీంకి కష్టమవుతోంది. దీంతో ఆ టీంను విస్తరించే పనిలో పడ్డారు పీకే.
తెలంగాణలో వైఎస్ఆర్టిపి కోసం, ఆంధ్రలో వైసీపీ కోసం పనిచేయడానికి ప్రస్తుతం ఉన్న టీం సరిపోవడం లేదు. దీంతో ఈ సంఖ్యను పెంచుతున్నారు. దీంతో తన టీఎంలో పనిచేయడానికి రాజకీయ వ్యూహకర్తలుగా రాణించడానికి బ్రిలియంట్ ఆంబిసియర్స్ కోసం పీకే చూస్తున్నారు.
ప్రస్తుతం పీకే టీఎంలో కీలక ఉద్యోగులకు నెలకు లక్షన్నర జీతం ఇస్తారట. తనకు సూటయ్యే ఉద్యోగుల కోసం పికె ముంబైలోని ఐఐటిని సంప్రదించారట. కనీసం 150 మంది ఐఐటియన్లను ఇంటర్వ్యూ చేశారట. అయితే, ఐఐటీలో చదివిన వారు ఆ ప్యాకేజీతో పనిచేయడానికి పెద్ద ఆసక్తి చూపడం లేదట. దీంతో దేశంలో మరిన్ని ఐఐటిలను సంప్రదించడానికి పీకే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
మరి మీకేమైనా ఆసక్తి ఉంటే ట్విట్టరు లేదా ఇతర సోషల్ మీడియా ద్వారా పీకేని సంప్రదించండి.