ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి శాసనసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే ఎలెక్షన్స్ సమయంలో `పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా` అంటూ స్టిక్కర్లు, పోస్టర్లు చేయించుకుని అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఎంతలా హంగామా చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నికల్లో పవన్ గెలిచిన తర్వాత ఈ ట్రెండ్ పిఠాపురం వాసులే కాకుండా ఏపీలో చాలా మంది ఫాలో అయ్యారు.
కార్లు మరియు బైకుల మీద పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే స్టిక్కర్లు, నేమ్ ప్లేట్లు అంటించుకుని భారీ ఎత్తున ర్యాలీలు చేశారు. ఎన్నికలు ముగిసి చాలా రోజులైనా వాటిని మాత్రం కొందరు తొలగించలేదు. అయితే తాజాగా ఒక చోటు బైక్ నెంబర్ ప్లేట్ కు బదులుగా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని రాసి ఉన్న నేమ్ ప్లేట్ ను పెట్టుకుని స్కూటీ ఇద్దరు యువకులు వెళ్తూ ట్రాఫిక్ పోలీసులు కంటపడ్డాడు. దాంతో వారికి పోలీసులు ఆపి `ఎవరయ్యా మీలో ఎమ్మెల్యేగారి తాలూకా అని ప్రశ్నించగా.. వాళ్లు నీళ్లు నమిలారు.
బైక్ ఎవరిది? ఎవరి పేరు మీద ఉంది? అంటూ వరుస ప్రశ్నలు వేశారు. అయితే బండిపై పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని రాయించుకోవడాన్ని పోలీసులు వ్యతిరేకించలేదు. పవన్ కళ్యాణ్ పై సదరు యువకులకు ఉన్న అభిమానాన్ని కూడా వ్యతిరేకించలేదు. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే.. బైక్ నెంబర్ ప్లేట్ తీసేసి.. ఆ స్థానంలో వారు ఎమ్మెల్యే గారి తాలూకా నేమ్ ప్లేట్‌ను తగిలించారు. ఇది ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధం. ఈ విషయాన్నే ట్రాఫిక్ పోలీసులు ఆ యువకులిద్దరికీ చాలా సాఫ్ట్‌గా చెప్పారు.
అలాగే వారి చేత నేమ్ ప్లేట్ ను తొలగించి.. నెంబర్ ప్లేట్ ను ఫిట్ చేయించారు. అభిమానం ఉంటే ఇలాంటివి బండిపై ఎక్కడైనా వేయించుకోవచ్చని.. కానీ నెంబర్ ప్లేట్ స్థానంలో వేయించుకుంటే ఊరుకోమని పోలీసులు తెలిపారు. నెంబర్ ప్లేట్ కనిపిస్తే దొంగతనం జరిగినప్పుడు, ఇంకేదైనా సమస్య వచ్చినప్పుడు తొందరగా పరిష్కరించగలమని వివరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. పోలీసులు సదరు యువకులకు ఫ్రెండ్లీగా చెప్పిన విధానంపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.
పిఠాపురం MLA తాలూకా… అని ఆ ఒక్క చోట కాకుండా ఎక్కడైనా వేయించుకొండి..👇#TDP #YSRCP #BJP #Janasena pic.twitter.com/n01aMet5SX
— sivazee (@sivazeestudio) July 6, 2024