దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, తెలుగువారికి టీడీపీ యువ నేత, మాజీ మంత్రి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు శుభాకాంక్షలు తెలిపారు. వేర్వేరుగా ఎక్స్ వేదికగా సందేశా లు విడుదల చేశారు. అయితే.. ఇరువు రు నాయకులు కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
పవన్ సందేశం ఇదీ..
ప్రజలను పట్టి పీడించే ఆధునిక నరకాసురులు ఎందరో యథేచ్ఛగా సంచరిస్తూ.. ప్రజల మాన, ధన ప్రాణాలను దోచుకుంటున్నారు. అటువంటి అపర నరకాసురుల బెడద తొలగిపోవాలని, ప్రజలు నిర్భయంగా, నిర్భీతితో నడయాడే మంచి రోజులు రావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.. అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
నారా లోకేష్ ఏమన్నారంటే
అవినీతి, అరాచకం, అహంకారం అనే చీకట్లని చీల్చే వెలుగుల పండుగ దీపావళి అని లోకేష్ అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో చెడు ఏ రూపంలో ఉన్నా విజయం సాధించడమే దీపావళి ఉద్దేశమని చెప్పారు. ప్రజలు సురక్షితంగా, సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.
కొసమెరుపు.. ఇరువురు నేతలు ఒకవైపు శుభాకాంక్షలు తెలియజేస్తూనే పరోక్షంగా ఏపీలో ఉన్న వైసీపీ సర్కారు అనే చీకటిని పారదోలాలనే పిలుపునిచ్చారని ఆయా పార్టీల అభిమానులు పేర్కొనడం గమనార్హం.