పవన్ కళ్యాణ్ పొత్తులకు ఉవ్విళ్లూరుతున్నారు.
తానే మొదట పొత్తుల ప్రతిపాదన తెచ్చిన పవన్ కండిషన్లు కూడా తానే పెడుతున్నాడు.
అసలు అధికారం లేకపోవడం వల్ల బాగా ఇబ్బంది పడింది, నష్టపోయింది పవన్ కళ్యాణ్ మరియు మెగా కుటుంబం.
దీంతో ఈసారి ఈ అవమానాలు భరించడం కంటే జగన్ ని దించడమే మేలు అనుకుంటున్నారు పవన్
అయితే… అది తనొక్కడివల్లే కాదని తెలుసు. అందుకే టీడీపీతో జతకట్టాలని ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవలే పొత్తు ప్రతిపాదన తెచ్చిన పవన్ ఈరోజు మరో అడుగు ముందుకు వేశాడు.
2014,19 లో తగ్గాం ఈసారి 2024లో తగ్గడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పిన పవన్… మూడు ఆప్షన్లు బయటపెట్టారు. ఆ మూడు ఆప్షన్లలో ఏదో ఒకటి తాను ఎంచుకోనున్నట్లు చెప్పారు.
ఆయన చెప్పిన మూడు ఆప్షన్లు…
1. బీజేపీ మనము కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం
2. జనసేన + బీజేపీ + టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం
3. జనసేన ఒక్కటే స్థాపించడం
అయితే… ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే… 2019లో జనసేన సొంతంగా పోటీ చేసింది. కానీ పవన్ ఈరోజు మాట్లాడుతూ 2019లో కూడా తాను తగ్గినట్లు చెప్పారు. ఆయన ఎక్కడ ఎలా తగ్గారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.
జనసేన+టిడీపీ possibility ఎందుకు లేదో? (నాకు తెలుసు). Anyway, thanks for the statement. https://t.co/2XQs8VVl0t
— APToday (@ReverseAndhra) June 4, 2022