• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చంచల్ గూడ జైల్ బ్యాచ్ నాకు నీతులు చెబుతోంది – పవన్ సెటైర్

ఆ వైసీపీ ఎంపీ చెప్పిన‌ట్టు న‌డుస్తా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

NA bureau by NA bureau
April 24, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా పర్యటన
0
SHARES
172
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వైసీపీ రెబ‌ల్‌ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు చెప్పిన‌ట్టు తాను న‌డుచుకుంటాన‌ని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “అనంతపురం సభ తర్వాత నర్సాపురం ఎంపీ (రఘురామ) నాకు కొన్ని సూచనలు చేశారు. మీరు సరిగ్గా కొన్ని వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు అని అన్నారు. సరిదిద్దుకోవాలని చెప్పారు. వారి సూచన మేరకు నేను సరిదిద్దకుంటాను. పోయినసారి చర్లపల్లి షటిల్‌ టీం అని అన్నాను. అది చర్లపల్లి కాదు.. చంచల్‌గూడ షటిల్‌ టీం అని చెప్పారు“ అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

కౌలు రైతు సమస్యలపై మాట్లాడుతుంటే..వైసీపీ నేతలు తనను దత్తపుత్రుడు అని అంటున్నారని  పవన్ అన్నారు. ఏలూరు జిల్లా చింతపులపూడిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన పవన్.. ఎవరెన్నిసార్లు అలా అన్నా తాను మాత్రం మర్యాదగా మాట్లాడానని తెలిపారు. ఇంకొకసారి తనను దత్తపుత్రుడు అని అంటే మాత్రం ఊరుకునేది లేదని, ఇలాగే కొనసాగితే సీఎం జగన్ను సీబీఐ దత్తపుత్రుడు అని అనాల్సి వస్తుందని హెచ్చరించారు.

కౌలు రైతులను ఆదుకునేవారు లేకుండా పోయారని అన్నారు. కౌలు రైతుల సమస్యలను వైసీపీ ప్రభుత్వం గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. మన రాష్ట్రంలో 3 వేలకు పైగా కౌలురైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల బాధిత కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థక సాయం చేశారు. కౌలు రైతులు అధిక వడ్డీకి అప్పు తీసుకుంటున్నారని..,అప్పు తీర్చలేక వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పవన్ వాపోయారు. రైతుల కన్నీరు తుడుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి..వారిని పట్టించుకోవటం లేదన్నారు.

రైతు సమస్యలు పరిష్కరించలేని గ్రామసచివాలయాలు ఎందుకు ? అని ప్రశ్నించారు. రైతుల కష్టాలపై మాట్లాడితే వ్యంగ్యంగా విమర్శిస్తారా ? ప్రభుత్వాన్ని నిలదీశారు. సీబీఐ దత్తపుత్రుడి మాటలను తాను పట్టించుకోనని.., నర్సాపురం ఎంపీ (రఘురామ కృష్ణరాజు) చెప్పిన సూచనలు పాటిస్తానని తెలిపారు. జనసేన కార్యకర్తలపై గూండాలతో దాడులు చేయిస్తున్నారని  ప్రభుత్వంపై పవన్‌ మండిపడ్డారు. తమ వారిపై దాడులు చేసే వైసీపీ నేతలకు మర్యాద దక్కదని హెచ్చరించారు. పచ్చని గోదావరి జిల్లాల్లోనూ రైతు ఆత్మహత్యలు దారుణమని పవన్‌ వాపోయారు.

రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు కేంద్రం ఇచ్చిన రూ.6 వేలు కాకుండా రూ.13,500 ఇవ్వాలన్నారు. సేంద్రియ సాగు విస్తీర్ణం మరింత పెంచాలన్నారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలపై రాయితీ తీసేశారని ఆక్షేపించారు. ముడిసరకు రావడం లేదని కృష్ణా జ్యూట్‌మిల్‌ మూసేశారని.., జ్యూట్‌మిల్‌ కార్మికులకు జనసేన అండగా ఉంటుందని తెలిపారు.

“ఇంకోసారి దత్తపుత్రుడు అంటే సీబీఐకి దత్తపుత్రుడు అనే మాటను ఫిక్స్‌ అవుతాం. కష్టాల్లో ఉన్నవారంతా నా సొంతవాళ్లే.. నేనేవరికి దత్తతగా వెళ్లను. పోయినసారి చర్లపల్లి షటిల్‌ టీం అని అన్నాను. అది చర్లపల్లి కాదు.. చంచల్‌గూడ షటిల్‌ టీం అని తెలిసింది. చంచల్‌గూడలో షటిల్‌ ఆడుతూ మీరు నాకు చెబుతున్నారా? కష్టాల్లో ఉన్నవారంతా నా సొంతవాళ్లే.. నేనేవరికి దత్తతగా వెళ్లను. నన్ను దత్తత తీసుకుంటే ఎవరూ భరించలేరు.“ అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

కౌలురైతుల సమస్యలను జనసేన గుర్తిస్తుంద‌న్నారు. ప్రతి కౌలురైతు కుటుంబానికి పరిహారం అందేలా చూస్తామ‌ని ప‌వ‌న్ చెప్పారు. యువత బాధ్యత తీసుకోకుంటే సమాజంలో మార్పు రాదని హెచ్చ‌రించారు. పరిశ్రమలు వస్తేనే కదా యువతకు ఉద్యోగాలు వచ్చేదని,  ప్రభుత్వమే మద్యం దుకాణా లు నడపడం ఏంటి ? అని ప్ర‌శ్నించారు. ఎన్నికల్లో రెండుచోట్లా ఓడిపోయినా మీ కోసం నిలబడ్డాన‌ని ప్ర‌జ‌ల‌ను వుద్దేశించి వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని.. యువ‌త అంతా జ‌న‌సేన వైపే ఉంద‌ని ప‌న‌వ్ చెప్పారు.

Tags: andhrapradeshfarmersjanasenapawan kalyan
Previous Post

షాకింగ్: మహిళలపై లైంగిక వేధింపుల్లో ఏపీకి రెండో స్థానం

Next Post

నెల్లూరు : బీజేపీ కామెడీ మామూలుగా లేదే..!

Related Posts

ఫడ్నవీస్ కు మరీ ఇంత కక్కుర్తా ?
Around The World

ఫడ్నవీస్ కు మరీ ఇంత కక్కుర్తా ?

July 1, 2022
ఘనంగా ఆటా సభలు ప్రారంభం… అతిథుల్లో ప్రముఖులు
Around The World

ఘనంగా ఆటా సభలు ప్రారంభం… అతిథుల్లో ప్రముఖులు

July 1, 2022
తెలుగుదేశం నేత అయ్యన్నపై కేసు
Andhra

హైకోర్టులో జగన్ కు మరో షాకిచ్చిన అయ్యన్న…

July 1, 2022
అన్నంత పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు..వైరల్
Andhra

అన్నంత పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు..వైరల్

July 1, 2022
RRR: ఈసారి సీబీఐని కూడా వదల్లేదు, జగన్ కి మరో పెద్ద షాక్
Andhra

అడ్డగోలు అరెస్టులు ఆపండి..రఘురామకు హైకోర్టు ఊరట

July 1, 2022
ఆ మల్లెపూలేయ్…మంత్రులపై అయ్యన్న సెటైర్లు వైరల్
Andhra

కోర్టుల్లేకుంటే కొట్టి చంపేవారు…అయ్యన్న షాకింగ్ కామెంట్స్

July 1, 2022
Load More
Next Post
సోము వీర్రాజు Somu Veerraju

నెల్లూరు : బీజేపీ కామెడీ మామూలుగా లేదే..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఫడ్నవీస్ కు మరీ ఇంత కక్కుర్తా ?
  • ఘనంగా ఆటా సభలు ప్రారంభం… అతిథుల్లో ప్రముఖులు
  • హైకోర్టులో జగన్ కు మరో షాకిచ్చిన అయ్యన్న…
  • అన్నంత పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు..వైరల్
  • అడ్డగోలు అరెస్టులు ఆపండి..రఘురామకు హైకోర్టు ఊరట
  • కోర్టుల్లేకుంటే కొట్టి చంపేవారు…అయ్యన్న షాకింగ్ కామెంట్స్
  • ఆన్ లైన్ టికెట్ల వ్యవహారంలో జగన్ కు హైకోర్టు షాక్
  • 2004లో జగన్ సీఎం అయ్యుంటే? చంద్రబాబు షాకింగ్ థియరీ
  • ఇది కదా సక్సెస్… ఆటో డ్రైవర్ సీఎం అయ్యాడే
  • మీనా భర్తకు ఆ అవయవం దొరక్కే..
  • మొదటి సారి టీఆర్ఎస్ కి మద్దతుగా మాట్లాడిన రేవంత్
  • రిచెస్ట్ పర్సన్ తో సహజీవనం చేస్తున్న తెలుగోళ్ల ఫేవరెట్ ఆంటీ
  • “అనంత ” దుర్ఘట‌న‌ – ప‌వ‌న్ స్పంద‌న ఇది..
  • ఐఏఎస్ శ్రీలక్ష్మిని ఇరికించిన ఏబీ
  • ఏపీ అధికారుల కట్టు కథ
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds