వారాహితో ఏపీకి వస్తున్నా… ఎవడాపుతాడో చూస్తా. తిరగడానికి ఒక బండి కావాలని చేయించుకుంటే, దానికి అమ్మవారి పేరు పెట్టుకుంటే… బస్సా? లారీయా? టైర్లు ఎంత? రంగేంటి అని అడుగుతున్నారు. నేనడుగుతున్నా… వైసీపీ చేసే దోపిడీ ఎంత?
నేను నా వారాహిలో ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతాను. ఎవరు ఆపుతారో నేనూ చూస్తాను. మీ ముఖ్యమంత్రిని రమ్మను. నీ కూసే గాడిదలను రమ్మను. నా వారాహిని ఆపండి, అప్పుడు నేనేంటో మీకు చూపిస్తా. జైహింద్ అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన వారాహి రథంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను సత్తెనపల్లి సభలో మాట్లాడుతూ పవన్ తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం పవన్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
నేను నా వారాహి ఆంధ్రప్రదేశ్ రోడ్లపైకి వస్తున్నాం, ఎవడాపుతాడో చూస్తాం.????????????@PawanKalyan ???????????????? pic.twitter.com/5gekxd522J
— JanaSena Samhitha (@JSPSamhitha) December 18, 2022
#JanaSenaRythuBharosaYatra @PawanKalyan #Varahi
వారాహి : pic.twitter.com/2Z5DPVr7An— V (@WARMA007) December 18, 2022