జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కేడర్లో ఉన్న అయోమయాలన్నీ పూర్తిగా పోగొట్టేశారు. ఈ సందర్భంగా పార్టీ గురించి కూడా క్యాడర్ కు క్లారిటీ ఇచ్చారు. జనసేనకు రాష్ట్ర వ్యాప్తంగా 18 శాతం ఓటింగ్ ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
కృష్ణా నుంచి శ్రీకాకుళం వరకు 25 శాతం.. ఉభయ గోదావరి జిల్లాల్లో 35 శాతం ఓటింగ్ ఉంది.. ఈ ఓటింగుతో సీఎం కావడం సాధ్యమా..? మనలో మనం ఒకసారి ఆలోచించుకోవాలి అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
త్రిముఖ పోరుతో జనసేనను బలి చేయడానికి నేను సిద్ధంగా లేను.. ఈసారి పొత్తులుంటాయి.. ఏ పార్టీతోనూ నాకు ప్రేమ లేదు.. ద్వేషం లేదు.. వ్యూహం తప్ప.. వైసీపీనే మన ప్రధాన ప్రత్యర్థి అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
ఈరోజు పార్టీ విధానం పొత్తుల గురించి విమర్శించేవారు నాకో విషయం చెప్పండి. 137 స్థానాల్లో జనసేన 2019లో పోటీ చేస్తే మీరెందుకు కనీసం 30-40 చోట్ల అయినా జనసేనను గెలిపించలేదు అని ప్రశ్నించారు. మనం కొన్ని సీట్లు సాధించుకుని సత్తా చూపితే అపుడు మనం బలంగా వాదన వినిపించవచ్చు అని పవన్ చెప్పారు.