అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్న వేళ.. ప్రతి చిన్న విషయానికి ఉండే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది.
తాజాగా హిందూపురం ఎమ్మెల్యే కమ్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలయ్య వద్దకు జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెళ్లటం.. వారిద్దరూ ఆత్మీయంగా మాట్లాడుకోవటం ఆసక్తికరంగా మారింది. వీరసింహాతో వీరమల్లు భేటీ హాట్ టాపిక్ గా మారింది.
అయితే.. తాజా భేటీ జరిగింది సినిమా సెట్లో అయినప్పటికీ.. దాని వెనుక ఉన్నది రాజకీయ కోణం తప్పించి.. మరింకేమీ కాదన్న మాట వినిపిస్తోంది. అటు సినిమా ఇండస్ట్రీలోనూ.. ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు తెర తీసిన ఈ భేటీ విషయంలోకి వెళితే.. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నందమూరి బాలక్రిష్ణ సినిమాల షూటింగ్ లు జరుగుతున్నాయి.
పవన్ హరిహర వీరమల్లు.. బాలయ్య వీర సింహారెడ్డి సినిమాల షూటింగ్ జరుగుతోంది. అయితే.. షూటింగ్ గ్యాప్ లో పవన్.. బాలయ్య సెట్ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ముందుగా.. ఎలాంటి షెడ్యూల్ లేకుండా సాగిన ఈ భేటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఈ నెల 27న ఇద్దరు ప్రముఖులు కలవాల్సి ఉంది. ఆహాలో ప్రసారమవుతూ విశేష ఆదరణ పొందుతున్న అన్ స్టాపబుల్ బాలక్రిష్ణ షోకు ఈసారి అతిధిగా పవన్ కల్యాణ్ రానుండటం తెలిసిందే. దీనిపై ఇప్పటికే బోలెడంత ఆసక్తి నెలకొంది.
దీని షూటింగ్ జరగటానికి ముందే.. బాలయ్య వద్దకు పవన్ నేరుగా వెళ్లి కలవటం ఒక ఎత్తు అయితే.. వారిద్దరూ దాదాపు ఇరవై నిమిషాలకు పైనే ఏకాంతంగా మాట్లాడుకోవటంతో వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? అన్నది ప్రశ్నగా మారింది. ఇరు వర్గాలకు చెందిన సన్నిహితులు అందిస్తున్న సమచారం ప్రకారం వారిద్దరి మాటల్లో రాజకీయ అంశాలే ఎక్కువగా వచ్చి ఉంటాయని చెబుతున్నారు. ఏమైనా.. ఏపీ రాజకీయాల్ని ప్రభావితం చేసే ఉదంతం చోటు చేసుకుందని చెప్పక తప్పదు.
మా ఇతర కథనాలు:
- ఇదీ బీజేపీ బండారం !
- మాచర్ల రణరంగం.. రచ్చచేసిన పోలీసులు
- TS : చంద్రబాబు గేమ్… కేసీఆర్ షాక్
- Ananya Nagalla : ఏం నడుమురా బాబూ, కేసైనా పర్లేదు పట్టుకోవాలనిపిస్తుంది