వైసీపీ హయాంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు నోటికి అడ్డూ అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు టీడీపీ, జనసేన నేతలు, వారి కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి మహిళలపై అసభ్యకరమైన పోస్టులు, అశ్లీలకరమైన పోస్టులు పెట్టడంపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే అటువంటి నేతలపై తాజాగా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్‌ను పోలీసులు కొద్ది రోజుల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా అనిల్ పై మరో కేసు నమోదైంది.
ఈ క్రమంలోనే కర్నూలుకు అనిల్ ను పీటీ వారెంట్‌పై త్రీ టౌన్ పోలీసులు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబును చంపుతానని అనిల్ బెదిరించిన నేపథ్యంలో అనిల్‌పై కర్నూలులో కేసు నమోదైంది. అంతకుముందు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు అనిల్ పై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే. గతంలో బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి ఘటనలో అనిల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ ఏ1గా, బోరుగడ్డ అనిల్ ఏ2 ఉన్నారు.
ఇఖ, ఏఈఎల్సీ చర్చి వివాదం కేసులో కూడా అనిల్‌ను పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. అనిల్ కు కోర్టు రిమాండ్ విధించగా ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకుముందు, ఈ విచారణ సందర్భంగా పోలీసుల వద్ద అనిల్ కన్నీరు మున్నీరైన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి తదితరుల ప్రోత్బలంతోనే తాను టీడీపీ నేతలను దూషించానని, బెదిరించానని అనిల్ వాపోయిన సంగతి తెలిసిందే.