యన్ ఆర్ ఐ టీడీపీ మహిళా విభాగం గత నెల 30 వ తేదీన పాత విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం లో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
అది ఎంతో మంది పేదల ఆకలిని తీరుస్తూ స్థానికుల మన్ననలు పొందింది.
అదే స్ఫూర్తితో అతి తక్కువ వ్యవధిలో, యన్ ఆర్ ఐ మహిళా విభాగం అధ్యక్షురాలు జాగర్లమూడి శివానీ బృందం ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ని NRI TDP USA Coordinator జయరాం కోమటి చేతుల మీదగా ప్రారంభింప చేశారు.
ఈ కార్యక్రమం లో జయరాం కోమటి మాట్లాడుతూ విదేశాలలో ఉన్న తమకు పేదల ఆకలి తీర్చే ఈ కార్యక్రమం ఎంతో తృప్తి నిచ్చిందని, ఈ కార్యక్రమాన్ని యన్ ఆర్ ఐ మహిళా విభాగం ఎంతో చక్కగా అమలు చేసిందని అభినందించారు.
రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు పాల్గొని తమ సందేశాన్ని ఇచ్చారు.
అలాగే కార్యక్రమం లో పాల్గొన్న పలువురు స్థానిక మహిళలు యన్ ఆర్ ఐ టీడీపీ మహిళా విభాగం నిత్యం తమతో మాట్లాడుతూ, తమకు ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, భరోసాన్ని ఇచ్చిందని తెలిపారు.
పాతపట్నం టీడీపీ నియోజకవర్గ బాధ్యులు కలమట వెంకట రమణ మాట్లాడుతూ తమ నియోజకవర్గం లో యన్ ఆర్ ఐ లు ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు యన్ ఆర్ ఐ లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో యన్ ఆర్ ఐ లు శ్రీకాంత్ దొడ్డపనేని, గోకుల్ రాచిరాజు, రాబోయే ఎన్నికలలో శృంగవరపు కోట టీడీపీ అభ్యర్థి గా ప్రచారంలో ఉన్న కృష్ణ గొంప తదితరులు పాల్గొన్నారు.