నందమూరి తారక రామారావు గారి పుత్రిక, చంద్రబాబు గారి సతీమణి నారా భువనేశ్వరి గారి పై వైసీపీ గ్యాంగ్ చేసిన తీవ్రమైన ,నీచమైన ఆరోపణలను న్యూజిలాండ్ తెలుగు దేశం శాఖ తీవ్రంగా ఖండిస్తోంది.పెద్ద వయసులో, పెద్ద పదవుల్లో వుంటూ రాష్ట్ర ప్రజలకు,ముఖ్యంగా భావితరాలకు మంచి చేయవలసిన చట్టసభలలో ఇలాంటి వికృత చేష్టలు జరగడం చాలా హేయమైన,నీచమైన దిగజారుడు సంస్కృతికి నిదర్శనంగా కనబడుతుంది.
వీళ్ళను ఇలాగే వదిలేస్తే రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలకు డిఎన్ఏ టెస్టులు చేసి ఎవరి పిల్లలు ఎవరికి పుట్టారో చెప్పే జగనన్న పిల్లల జన్మ నిర్ధారణ పథకం పెట్టి దానిమీద కూడా కోట్లు సంపాదించే ఆలోచన చేస్తారేమో ?
ఇప్పటికే రాష్ట్రంలో మతాలు,కులాలు మరియు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు.ఇప్పుడు కుటుంబాల్లో కూడా వేలుపెట్టి మనిషికి మనిషికి కూడా దూరం పెంచాలని చూస్తున్నారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు మేలుకొని ఇలాంటి ప్రభుత్వానికి ,ప్రజా ప్రతినిధులకు బుద్ధి చెప్పకపోతే రేపు ప్రతి ఇంట్లో ఇదే పరిస్థితి రావచ్చు. ఇది తెలుగు సమాజానికి అత్యంత ప్రమాదకరం.
ఆంధ్రుడా మేలుకో…. చేసిన తప్పు సరిదిద్దుకో. అని న్యూజిలాండ్ తెలుగుదేశం పార్టీ ప్రతినిధి కృష్ణమనేని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు