ఈ రోజు 27/08/2021 శుక్రవారం రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ తెలుగుయువత అద్యక్షులు తోపిరెడ్డి నవీన్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా యన్.ఆర్.ఐ. తెలుగుదేశం కువైట్ తెలుగుయువత విభాగం ఆద్వర్యంలో కడప జిల్లా రాజంపేట అంతటా ఘనంగా పోస్తేర్స్ తో పసుపు దనంతో వుట్టి పడినట్ట్లు గా నిర్వహించారు . అధేవిదంగా కువైట్ లో కూడా తెలుగుదేశం శ్రేణులు అందరూ కూడా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియచేసారు , చాలా మంది పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తు, తెలుగుదేశం పార్టీ అదికారంలోనికి తీసుకొని రావడానికి, యన్.ఆర్. ఐ. తెలుగుదేశం కువైట్ వారి కృషిని కొనియాడారు.
ఈ సంధర్భంగా యన్.ఆర్. ఐ. తెలుగుదేశం కువైట్ ప్రధానకార్యదర్శి నాగేంద్ర బాబు మాట్లాడుతూ, ముఖ్యంగా రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ తెలుగుయువత అద్యక్షులు తోపిరెడ్డి నవీన్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తు , కువైట్ లో ఉన్న తెలుగు దేశం పార్టీ అభిమానులను , సానుబూతి పరులను,కార్యకర్తలను, రాష్ట్ర ప్రగతి గురించి ఆలోచించే తటస్థులను, బడుగు బలహీన, దళిత మైనరటి వర్గాల నాయకులను, అందర్నీ ఒక వేదికగా చేసుకుని. పటిష్టమైన కార్యచరణతో 2024 తెలుగుదేశం పార్టీ గెలుపే ధ్యేయంగా, నిత్యం నీళ్ళలో చేపలగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో వున్నా, అదికారంలో వున్న ప్రజల మద్య వుంటూ , ప్రజా సమస్యలపైనా పోరాటం చేసిన ఏకైక పార్టీ అని ప్రజలు గుర్తించారు, 2024 ఎన్నికలలో తెలుదేశం పార్టీ ని అదికారంలోనికి తీసుకొని వచ్చి రాష్ట్రాభివృద్దికి నడుంబిగించాలని ప్రజలే ముందుకు వస్తున్నారని, అదేవిదంగా ప్రాంతీయ, జాతీయ ,అంతర్జాతీయ తెలుగుసమాజాలు కూడా ఆంధ్రరాష్ట్ర అబ్భివృద్దికోసం తెలుగుదేశం పార్టీ ఒక్కటే చక్కటి వేదిక అని ఒక నిర్ణయానికి రావడం చాలా సంతోషంగా వుంది అని యన్.ఆర్. ఐ. తెలుగుదేశం కువైట్ ప్రధానకార్యదర్శి నాగేంద్ర బాబు తెలియచేసారు
ఆంధ్రరాష్ట్ర మరియు మన బిడ్డల అబివృద్దికోసం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తిరిగి రావడం, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా ఉండడమే ముఖ్యమని అదేవిదంగా పోలవరం దేశంలోనే అన్ని ప్రాజెక్టులు కంటే ముందుగా 70 శాతం ప్రాజెక్ట్ పూర్తి చేసి,పైసా ప్రభుత్వానికి ఖర్చు లేకుండా పక్క రాష్ట్రాలు ఈర్ష పడేలా ఆర్థిక సంపదను సృష్టించే రాజధాని దేశంలోనే అతి వేగంగా నిర్మించిన గనత తెలుగుదేశం పార్టీ కె సాద్యామ్ అని జాయింట్ సెక్రెటరీ ,మోహన్ రాచూరి తెలిపారు.
రాష్ట్ర తెలుగుయువత అద్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ఆదేశాలు మేరకు, నవీన్ కుమార్ రెడ్డిపిలుపు మేరకు కువైట్ లో జీవనం కొనసాగిస్తున్న తెలుగువారికి అందరికీ మావంతు బాద్యతగా వుంటూ గత తెలుగుదేశం ప్రభుత్వం లో కూడా APNRT సంవస్థ ద్వారా ఎన్నో సేవలు అందించాము, ఇప్పుడు కూడా అందిస్తున్నామని అదేవిదంగా గ్రామాల్లో 23 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసి,8 వేల కిలో మీటర్లు పొలాలకు మెటల్ రోడ్లు వేసి, లక్ష చెరువులు తవ్వించటం లేదా పూడిక తీయించటం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ధే ఇవన్నీ మల్లి జరగాలి అంటే తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం మన అందరి అవసరం అని … యన్.ఆర్.ఐ తెలుగుయువత అధ్యక్షులు మల్లి మరాతు తెలియచేసారు.
అన్న కాంటిన్స్ తో 5 రూపాయలతో అన్నమ్ పెట్టి, దేశంలో ఎవరూ ఇవ్వనంత ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ 1500 కోట్లు కేటాయించిన ఘనత తెలుగుదేశం పార్టీదే, కీయాలంటి సంస్థలు మన రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి మల్లి తెలుగుదేశం పార్టీ అదికారంలోనికి రావాలని యన్.ఆర్.ఐ తెలుగుయువత ఉపా అధ్యక్షులు శ్రీనివాస రాజు వెలిగండ్ల తెలియచేసారు చేశారు..
10 వేలకోట్లు డ్రాక్వా రుణాలు రద్దు చేసి,10 లక్షల పేదల ఇళ్లను దేశంలో ఎవరూ నిర్మించనంత వేగంగా నాలుగేళ్ళల్లోనే పూర్తి చేశారు..4 లక్షల ఇళ్ల పట్టాలు విడిగా పంపిణీ చేసీన గనత తెలుగుదేశం ప్రభుత్వం దే బీసీలకు15 వేలకోట్లు, ఎస్సిలకి 10 వేలకోట్లు, బ్రాహ్మణులకు 100 కోట్లు,కాపులకు 1000 కోట్లు కేటాయించి వారి అభివృద్ధికి కృషి చేశారు…ఇంకా మనం అబివృద్ది జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావలసిన అవసరం వుందని రాణి చౌదరి(సోషల్ మీడియా కొ ఒర్డినేటర్) తెలియచేసారు .
కోవిడ్ నిబంధనలను దృష్టిలో వుంచుకొని అతి తక్కువమందితో కార్యక్రమము నిర్వహించడం జరిగినది . అందరినీ ఆహ్వానించలేక పోయినందుకు క్షమించాలి , రాయల సీమలో మొదటిసారిగా అత్యధికంగా సాగునీరు,తాగు నీరు అందించిన గనత తెలుగుదేశం ప్రభుత్వం, కావున మనం అందరం తెలుగుదేశం ప్రభుత్వం అదికారంలో నికి తీసుకొని రావడానికి ముందుకు రావలసిన అవసరం వుందని మురళి దుగ్గినేని ప్రధాన కార్యదర్శి తెలుగుయువత, మరియు కొల్లపనేని రమేష్ , శివకుమార్ గౌడ్, రవికుమార్ మల్లిశెట్టి తెలియచేసారు.