తెలుగుదేశం అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ డీజీపీకి లేఖ రాశారు. శాంతి భద్రతలు క్షీణించడం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తే దాడులు చేయడం చాలా నిత్యకృత్యం అయిపోయిందని చంద్రబాబు విమర్శించారు.
రూల్ ఆఫ్ లా అనేది ఒకటుందని మరిచిపోయారని, పోలీసు శాఖ నిశ్చేష్టులై చూస్తున్నారని, తప్పు చేసిన వారికి వంతపాడుతున్నారని చంద్రబాబు లేఖలో విమర్శించారు.
వెంటనే పరిస్థితులను సరిదిద్ధి పోలీసులు బాధితుల పక్షాన నిలబడే ప్రయత్నం చేయాలన్నారు. ఏపీలో పోలీసు వ్యవస్థ బలహీన పడితే ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందన్నారు.