ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి… మోడీకి దండాలు పెట్టారు. ఎంతో ప్రేమగా చూసుకున్నారు. అడిగిన బిల్లుకంతా మద్దతు తెలిపారు. పాద నమస్కారం కూడా చేశారు. కానీ అవేమీ ఫలించలేదు. జగన్ ని సీఎం చేస్తే ప్రత్యేక హోదా తెస్తాడు అని జనం అనుకున్నారు. కానీ ఆయన ప్రత్యేక హోదా రాదు అని స్వయంగా తేల్చేశాడు. అంతేకాదు, ఇక రాజధాని తనే పీకేసే ప్రయత్నం చేస్తున్నాడు. అటు కేంద్రంలో మోడీ ఈరోజు పెద్ద షాక్ ఇచ్చాడు. పోలవరంకి 56 వేల కోట్లు ఇచ్చేది లేదు. ఏం చేస్కుంటావో చేస్కో పో అన్నాడు. పాపం… ప్రత్యేక హోదా మాట వరసకే అడగలేం అని తేల్చేసిన పెద్దమనిషి పోలవరంపై కేంద్రాన్ని ఏమని నిలదీయగలడు?
ప్రాజెక్టు కట్టడం అంటే అది పునరావాస పరిహారంతో కలిపితేనే దానిని ప్రాజెక్టు అంటారు. అంతేగాని… ఆ మాత్రం సిమెంటు ఇసుక రాష్ట్రం కొనలేదా? ఇది కేంద్ర పెద్దలకు తెలిసినా…. వారు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ బలహీనతను అడ్డంపెట్టుకుని ఆడుకుంటున్నారు.
చంద్రబాబు హయాంలో 56 వేల కోట్లకు ఆమోదించుకుని వస్తే తాను మెక్కడానికే ప్రాజెక్టు వ్యయం పెంచాడు చంద్రబాబు అని ఆరోపించిన వైకాపా నేతలు నేడు చంద్రబాబు వల్లే ప్రాజెక్టుకు కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదు అంటున్నారు. ఇప్పటికే యుట్యూబులో సాక్ష్యాలున్నాయి. చంద్రబాబు ప్రాజెక్టు కాస్ట్ పెంచాడు అని వారు ఆరోపించిన అన్ని వీడియోలు ఉన్నాయి. కానీ చంద్రబాబు ఆమోదించుకుని వచ్చిన ధరలో కేంద్రం భారీ కోత పెట్టింది.
కేంద్రం భారీగా కోత పెట్టడానికి ముఖ్యమంత్రిపై ఉన్న కేసులే కారణం…. ఏం అన్యాయం చేసినా జగన్ అడగలేడు అని వారు తగ్గించేశారు అని టీడీపీ నేతలు అంటున్నారు. ఏతావాతా… ముఖ్యమంత్రిపై ఉన్న కేసుల కారణమో ఇంకేం కారణమో తెలియదు గాని ఏపీ మాత్రం పోలవరం ప్రాజెక్టు కోల్పోయింది. దారుణంగా నష్టపోయింది. జగన్ చెప్పినట్లు 2021 జూన్ కి పోలవరం కట్టడం మాట అటుంచితే 2024 ఎన్నికల నాటికి కూడా పోలవరం పూర్తి కాదు. ఆరోజు చంద్రబాబు పెంచిన ధర చెల్లించాలని ఢిల్లీకి వీరు చక్కర్లు కొడుతున్నా డబ్బులు ఇవ్వం అని కేంద్రం ఖరాఖండిగా చెప్పేసింది.
ఇదంతా విజయవాడ పౌరుడు ఒకరు కేంద్రానికి సమాచార హక్కు చట్టం కింద లెటర్ పెడితే కేంద్రం ఇచ్చిన సమాధానం ద్వారా తెలిసింది. పునరావాస పరిహార ప్యాకేజీతో మాకు సంబంధం లేదని కేంద్రం తేల్చేసింది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంలో ప్రత్యేకహోదా, పోలవరం, అమరావతి… ఈ మూడు ప్రజలకు దక్కకుండా పోయాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.