Pics: ఇంకా వరద నీటిలో ఏపీ... లోకేష్ టూర్ లో బట్టబయలు
ఏపీలో వర్షాలు ఆగిపోయి వారం కావస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... ఇప్పటికీ వరద నీటి నుంచి జనాల్ని బయటపడేయలేకపోయింది జగన్ ప్రభుత్వం. ప్రభుత్వ వ్యవస్థకు ఇది సుదీర్ఘ సమయం. కానీ ప్రభుత్వం రాజకీయ కక్ష్యలపై పెట్టిన శ్రద్ధ జనాలపై పెట్టడం లేదు. దీంతో జనం ఇంకా వరద నీటిలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ... ఉండి నియోజకవర్గం, సిద్ధాపురం గ్రామంలోని చాకలి పేటలో నీట మునిగిన ఇళ్ళను పరిశీలించాను. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇంట్లో అడుగు మేర పేరుకుపోయిన బురద, బయట చెరువును తలపిస్తోన్న రోడ్లతో ప్రజల బాధలు వర్ణనాతీతం (1/2) pic.twitter.com/2HP5JPXbdw
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) October 26, 2020
ఏపీలోని 13 జిల్లాలకు గాను 9 జిల్లాల్లోని అత్యధిక శాతం పంటలు వరద నీటికి, భారీ వర్షాలకు పాడైపోయాయి. దీంతో అన్ని పంటలు, అన్ని రకాల వ్యవసాయం చేసే రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటంతా కోల్పోయారు. సరిగ్గా పంట చేతికి వచ్చే సమయానికి వచ్చిన వరుస వానలతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అన్ని నదులకు వరదలు రావడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఇల్లు, పొలాలు మునిగిపోయాయి.
అయితే, ప్రభుత్వ సానుభూతి మీడియా ప్రజల కష్టాలను సరిగా ప్రతిబింబించలేకపోవడంతో వారి కష్టాలు తెరమీదకు రాలేదు.అయితే, రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడంతో పరిస్థితులు ఇప్పటికీ దారుణంగా ఉన్న విషయం వెలుగు చూసింది. లోకేష్ పర్యటనలో ఫొటోలను చూస్తే గ్రామీణులు, రైతులు ఎంత దుర్భరమైన కష్టాల్లో ఉన్నారో అర్థమవుతుంది. కింది ఫొటోలు చూడండి.












