ప్రభుత్వాల పరంగా ఇవి రెండు రాష్ట్రాలే గాని ప్రైవేటుగా ప్రజలకు మాత్రం ఇది ఇప్పటికీ ఒక రాష్ట్రం కిందే లెక్క. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధినపుడు, పథకాల వంటి వాటికోసమే తేడా. మిగతా విషయాల్లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితులే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అప్పటికంటే సంబంధాలు మెరుగుపడ్డాయి ప్రజల మధ్య. లావాదేవీలు కూడా పెరిగాయి.
అయితే, కరోనా పుణ్యమా అని మేము వేరు మీరు వేరు అనే దయనీయ పరిస్థితి వచ్చింది. ఎవరికి వారు మీరు మా రాష్ట్రంలోకి రావద్దనడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కరోనాను జగన్ నిర్లక్ష్యం చేయడంతో కేసీఆర్ భయపడి సరిహద్దు నిబంధనలు పెంచడం తెలిసిందే.
ప్రతిరోజూ నిత్యం అటు ఇటు తిరగడం అలవాటైన తెలుగువారికి ఈ పాస్ లు పెద్ద తలనొప్పిగా మారాయి. ఎన్నో లావాదేవీలు వ్యాపారాలు ఆగిపోయాయి. దీంతో పెద్ద చిక్కొచ్చిపడింది. తాజాగా కేసీఆర్ ఒక గుడ్ న్యూస్ రెడీ చేశారు. 20వ తేదీ నుంచి లాక్ డౌన్ సడలింపులు బాగా పెంచుతారట. అంతే కాదు, అప్పటి నుంచి తెలంగాణలోకి రావడానికి ఏ పాసూ అక్కర్లేదట. నేరుగా వచ్చేయొచ్చు.
ఇంతకీ ఎందుకీ నిర్ణయం అంటే… రైళ్లు విమానాల్లో ఒకరికి ఒకరు అతుక్కుని అంటించుకుని వస్తుంటే వారికి ఏ పాసులు అడగడం లేదు. అదే ఒక కుటుంబం వారు మాత్రమే కారులో ఒంటరిగా ఎవరినీ కలవకుండా వస్తుంటే వారిని పాస్ అడగడం ఏంటి అని ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయట.
నిజమే కదా ఫ్లైట్లు, ట్రైన్లలో జనాల్ని ఆపకుండా కార్లలో వచ్చేవారిని వద్దనడం మంచిదికాదన్న నిర్ణయానికి వచ్చిందట ప్రభుత్వం. ఇది ఆంధ్రులకు పెద్ద ఊరట. తెలంగాణ సరిహద్దు ప్రజలకు కూడా చాలా పెద్ద ఊరట ఇది.