కర్ణాటక లో భారీ ఎత్తున మెజారిటీ దక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు లేని విధంగా సరికొత్త ప్రయోగం చేసింది. తాజాగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరిగింది. దీంతోపా టు.. మంత్రులుగా 8 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. మంత్రి వర్గ కూర్పులో కాంగ్రెస్ పార్టీ సోషల్ ఇంజనీరింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చింది. అన్ని వర్గాలను కలుపుకొని పోయే ప్రతిపాదన చేసింది.
దీంతో కర్ణాటకలోని దాదాపు అన్ని కులాల వారికీ మంత్రి పదవులు దక్కాయి. చివరకు మైనార్టీ వర్గానికి కూడా మంత్రి పదవి దక్కడం గమనార్హం. మంత్రి పదవులు దక్కించుకున్నవారిలో.. జి. పరమేశ్వర (దళిత), కేహెచ్ మునియప్ప(దళిత), కేజే జార్జ్(క్రిష్టియన్), ఎంబీ పాటిల్(లింగాయత్), సతీష్ జార్కలి(ఎస్టీ), జమీర్ అహ్మద్(ముస్లిం మైనార్టీ), రామలింగా రెడ్డి(ఓసీ), సతీష్ జార్కిహోలి(ఎస్టీ) ప్రమాణ స్వీకారం చేశారు.
ఇక, సీఎం సిద్దరామయ్య(బీసీ), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(వక్కళిగ) వర్గాలకు చెందిన వారు. దీంతో రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాల వారికీ ప్రాధాన్యం ఇచ్చినట్టు అయింది. సిద్దరామయ్య.. ముఖ్యమం త్రి పీఠం ఎక్కడం ఇది రెండోసారి. 2013లో ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన జేడీఎస్ పార్టీ నుం చి వచ్చి 2010లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత 13 ఏళ్లుగా పార్టీలో సేవలు అందిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలకు అందరి ఆహ్వానం
కర్నాటకలో మంత్రి వర్గ ప్రమాణ స్వీకారకార్యక్రమానికి పలువురు ప్రముఖులు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. తమిళ నటుడు కమల్‌హాసన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్, రాజస్థాన్ సీఎం గెహ్లాట్, ఛత్తీస్గర్ సీఎం భూపేశ్ భగేల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఫరూక్ అబ్దుల్లా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరైన వారిలో ఉన్నారు. అయితే.. తెలంగాణ నుంచి కేసీఆర్, ఏపీ నుంచి జగన్‌కు ఎలాంటి ఆహ్వానాలు అందలేదని తెలిసింది.