అమరావతి నుంచి రాజధానిని తరలించాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల ఒకడుగు ముందుకు పదడుగులు వెనక్కు వెళ్తున్నట్టు అవుతోంది.
జగన్ కి సంపూర్ణ మద్దతు ప్రకటించి మూడు రాజధానులు చేస్తే కేంద్రానికి డబ్బులిచ్చే పని తప్పుతుందని బీజేపీ ప్రయత్నించి ఫీలర్లు వదులుతున్నా జనంలో వ్యతిరేకత చూసి జంకుతోంది.
అందుకే మొన్నామధ్యన పార్లమెంటులో ఒక ప్రకటన ఇచ్చింది.
కోవిడ్ -19 మహమ్మారి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై ఇంధన ధరల పెంపు ప్రభావాన్ని గురించి పెట్రోలియం మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన అది. అందులో 28 రాష్ట్రాల్లో రాజధాని నగరాలను పేర్కొంది. ఏపీ లో విశాఖను తీసుకుంది. అయితే, దానిపై ఏపీ ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేయడంతో … అది కేవలం ముఖ్య నగరాల జాబితాయే గాని రాజధానుల జాబితా కాదు అంటూ మళ్లీ ప్రత్యేక ప్రకటన ఇచ్చింది
ఈ అంశంపై హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్నందున అది తేలేవరకు రాజధాని మారదు అన్నది అందరికీ తెలిసిందే.
రాజధాని మార్పు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ఆ నిర్ణయంలో తమకేమీ పట్టదని రాష్ట్ర హైకోర్టుకు కేంద్రం స్పష్టం చేసినప్పటికీ అపుడపుడు కేంద్రం విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా గుర్తిస్తూ పిల్లిమొగ్గలు వేస్తోంది. మళ్లీ తాజాగా అలాంటి పనే చేసింది కేంద్రం.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసిన తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్.. కలిసి డిసెంబర్ 4న విశాఖలో నేవీ డే వేడుకలకు హాజరుకావాలని కోరారు. అనంతరం మీడియాకు ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఇందులో విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఆఫ్ ఏపీగా పేర్కొన్నారు. అధికారికంగా ఆమోదముద్ర పడకున్నా.. విశాఖను పరిపాలన రాజధానిగా పేర్కొనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇది కోర్టు ధిక్కారం కింద కనిపిస్తోంది.
దీనిపై ఎంపీ రఘురామరాజు కేంద్రానికి ఫిర్యాదు చేయడం గమనార్హం. కోర్టులో కేసు నడుస్తుండగా దీనిని ఎలా పేర్కొంటారు అంటూ ఆయన ఫిర్యాదు చేశారు.
#Vizag – headquartered Eastern Naval Command describes #Visakhapatnam as the Executive Capital City of #AndhraPradesh pic.twitter.com/M7eGHZ98Nt
— P Pavan (@PavanJourno) November 5, 2021