ఏపీలో ఓట్ల సునామీ.. సీట్ల సునామీ సృష్టించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు జాతీయ మీడియాలోనూ ప్రశంసల సునామీ వెల్లువెత్తింది. ముఖ్యంగా జాతీయ పత్రికలు.. పెద్ద ఎత్తున ఆయనపై వ్యాసాలు రాస్తూ నే ఉన్నాయి. పార్టీ విజయం దక్కించుకోవడం ఒక ఎత్తయితే.. ఇప్పడు కేంద్రంలో ఎన్డీయే కూటమిని అధికారంలోకి తీసుకురావడంలోనూ..చంద్రబాబు పాత్ర అంత కన్నా కీలకం. చంద్రబాబు కాదంటే మోడీ మూడోసారి కల ఫలించడం ఈజీకాదు.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇండియా టుడే పెద్ద ఎత్తున వ్యాసాలు రాయడంతోపాటు. చానెళ్లలోనూ ప్రసారాలు చేసింది. తిరుగులేని నాయకుడు అంటూ.. ఆయన రాజకీయ ప్రస్తానం మొదలు పెట్టిన నాటి నుంచి అనేక విషయాలను ఇండియా టుడే ప్రస్తావించింది. వరుసగా ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తోం ది. ఇక, ఎన్నికల ఫలితాల తర్వాత అంతర్జాతీయ మీడియాలోనూ చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తూ వార్త లు వచ్చిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా జాతీయ మీడియా విషయానికి వస్తే.. రిపబ్లిక్ టీవీ, న్యూస్ 18, ఇండియా టుడే సంస్థలు ఒకదా నితో ఒకటి పోటీ పడి మరీ.. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తూ.. కథనాలు ప్రచారం చేస్తున్నాయి. చంద్ర బాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఆయన చేసిన కార్యక్రమాలు.. తీసుకువచ్చిన రిఫార్మ్స్.. వంటివి ప్రత్యేకంగా ప్రస్తావిస్తుండడం గమనార్హం. ఇదేసమయంలో చంద్రబాబును సీఈవోగా పేర్కొన్నాయి. ఎంఏ ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసిన చంద్రబాబు పాలన ఓటు బ్యాంకు రాజకీయాలకు భిన్నంగా సాగిందని తెలిపాయి.
హైదరాబాద్‌ను సైబరాబాద్‌గా తీర్చిదిద్దడంలోనూ.. ఏపీని నవ్యాంధ్రగా మార్చడంలోనూ చంద్రబాబు సక్సెస్ అయ్యారని జాతీయ మీడియా కొనియాడింది. బిల్‌గేట్స్‌ను హైదరాబాద్ రప్పించిన వైనాన్ని గుర్తు చేసింద. ప్రఖ్యాత టైం మ్యాగజైన్ నుంచి ‘సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్’గా అవార్డు అందుకున్న విషయాన్ని కూడా జాతీయ మీడియా ప్రస్తావించింది.ముఖ్యంగా ఏపీకి రాజధాని విషయంలో చంద్రబాబు తపించారని, అమరావతిని రాజధాని చేసేందుకు కృషి చేశారని కొనియాడింది. అయితే.. ఇప్పుడు చంద్రబాబుకు మరిన్ని బాధ్యతలు పెరిగాయని జాతీయ మీడియా అభిప్రాయపడడం గమనార్హం.