స్వీయ సంస్కారం అన్నది ఒకటి ఉంటుందని, దానిని ఎవ్వరూ మరిచిపోకూడదన్నది పెద్దల మాట. కానీ ఆ మాట కొన్ని సందర్భాల్లో కొందరు పాటించని కారణంగా వివాదాలే రేగుతుంటాయి. సరిగ్గా ఈ కోవలోనే ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ ఓ వివాదంలో ఇరుక్కున్నారు.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు సంబంధించి ఏర్పాటు చేసిన వీడ్కోలు సభ సందర్భంగా మోడీ కెమెరా దృష్టిలో పడేందుకు ఆఖరికి తనను నమస్కరిస్తున్న పెద్దాయనను కూడా పలకరించలేదు. పాపం పెద్దాయన మోడీని చూస్తూ పదే పదే నమస్కరిస్తున్నా మీడియా కెమెరాలకు ఫోజులిస్తూ ఉండిపోయారు. దీంతో ఇదే వీడియోను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.
భారత మాజీ రాష్ట్రపతి కంటే ఫొటోలే ముఖ్యమై పోయినయ్ ……
pic.twitter.com/UgVEAzwck8— BPK 0+ (@bharadwaj038) July 23, 2022
పెద్దాయన ఇవాళో రేపో విరమణ చేస్తున్న వేళ ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా, ఇంతగా ఆయన్ను అవమానించాలా అని ప్రశ్నిస్తున్నారు. ఇదేనా సామాజిక న్యాయం అంటే అని కూడా నిలదీస్తున్నారు.
మాట్లాడితే చాలు తాము అట్టడుగు వర్గాల పక్షానే ఉన్నామని, తమ చొరవతోనే ఛాయ్ వాలా ప్రధాని అయ్యారని, తమ చొరవతోనే ఆటోవాలా ముఖ్యమంత్రి అయ్యారని, తమ చొరవతోనే ఓ టీచరమ్మ రాష్ట్రపతి అయ్యారని పదే పదే విన్నవించే బీజేపీ పెద్దలు ఆపాటి సంస్కారంను ఎలా విడిచి ఉంటారని ప్రశ్నిస్తున్నాయి టీఆర్ఎస్ వర్గాలు కూడా !
గతంలో కూడా మోడీ ఇదే విధంగా నడుచుకున్న తీరు ఒకటి వైరల్ అయింది. అప్పుడు కూడా ఆయన మీడియా కెమెరాలకు చిక్కేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని విమర్శలు కొన్ని వినిపించాయి. అప్పుడు కూడా మోడీ ఫొటోలు కొన్ని వైరల్ అయ్యాయి కూడా ! తాజాగా రామ్ నాథ్ కోవింద్ వ్యవహారంపై బీజేపీ ఏ విధంగా స్పందిస్తుందో అన్న ఆసక్తి ఒకటి అందరిలోనూ నెలకొని ఉంది.
ఇక కొత్త రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ను ఏ విధంగా చూసుకుంటారో, ఏ విధంగా ఆమె గౌరవానికి భంగం వాటిల్లకుండా నడుచుకుంటారో అన్న విషయమై కూడా ఇప్పటి నుంచి చర్చోపచర్చలు కొన్ని వివిధ విపక్ష పార్టీల నడుమ నడుస్తున్నాయి. వీలున్నంత వరకూ మనుషులను గౌరవించడం, వారి స్థాయికి విలువ ఇవ్వడం అన్నవి ఎన్నటికీ మరిచిపోకూడని విషయాలు అన్ని వీటిని గుర్తించుకోకుండా నడుచుకోవడం ఎవ్వరికీ మంచిది కాదని, ఇవే ఎదుగుద
లనూ ప్రభావితం చేసే విషయాలు అవుతాయని పలు పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక నిన్నటి వేళ రామ్ నాథ్ కోవింద్ వెళ్తూ వెళ్తూ.. రాష్ట్రపతి హోదాలో పార్టీలకు కొన్ని మంచి మాటలే చెప్పారు. మహాత్ముని అడుగుజాడల్లో ప్రజాప్రతినిధులు నడుచుకోవా
2/2.. #SundaySong "Millions of people go by.. but they all disappear from view… and I only have eyes for you" — @NarendraModi.. The love and lust for camera is almost bordering on disgusting obsession.. even ignoring the President's Namaste.. pic.twitter.com/dOD9aCudW1
— PolitiCrooks (@PolitiCrooks) July 24, 2022
Comments 1