పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో మండవ వెంకటరమణారావు మిస్సింగ్ అయ్యారు. అయితే `ఈ రోజు నా పుట్టిన రోజు.. నేను చనిపోయే రోజు కూడా..` అంటూ కుటుంబ సభ్యులకు వెంకటరమణారావు మెసేజ్ పెట్టి అదృష్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లో కి వెళ్తే.. నరసాపురంలో ఎంపీడీవోగా పని చేస్తున్న మండవ వెంకటరమణారావు విజయవాడ సమీపంలోని కానూరు మహదేవపురంలో నివాసం ఉంటున్నారు.
ఈ నెల 10 నుంచి 20 వ తేదీ వరకు సెలవులు పెట్టుకున్న ఆయన.. జులై 15న ఏదో పని ఉందని, మచిలీపట్టణం వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరారు. అదే రోజు రాత్రి కుటుంబసభ్యులు ఫోన్ చేయగా.. తాను బందురులో ఉన్నట్టు చెప్పారు. అయితే ఆ తర్వాత వెంకటరమణారావు ఫోన్ పని చేయాలేదు. అర్థరాత్రి దాటిన అనంతరం కుటుంబ సభ్యులకు వెంకటరమణారావు ఓ షాకింగ్ మెసేజ్ పెట్టారు.
`నా పుట్టిన రోజైన 16వ తేదీయే.. నేను చనిపోయే రోజు కూడా. అందరూ జాగ్రత్త` అని ఆయన పంపిన మెసేజ్ లో రాసి ఉంది. దాంతో ఖంగారు పడిన కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీసులకు మంగళవారం ఉదయాన్నే ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వెంకటరమణారావు వాహనం మచిలీపట్టణం రైల్వేస్టేషన్లో ఉన్నట్టు గుర్తించారు.
అయితే వెంకటరమణారావు జాడ మాత్రం ఇంత వరకు తెలియలేదు. ఆయన మొబైల్ సిగ్నల్స్ ను ట్రాక్ చేయగా.. ఏలూరు దగ్గర కాలువ సమీపంలో ఆగిపోయినట్లు తేలింది. దాంతో వెంకటరమణారావు సుసైడ్ చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, మాధవాయిపాలెం పెర్రీ రేవు పాటదారు రూ. 54 లక్షల బకాయిలు ఉండడమే వెంకటరమణారావు అదృశ్యం కావడానికి కారణమని వార్తలు వస్తున్నాయి.