టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ విశ్వరూపం చూపిస్తున్నారు. యువగళం పాదయా త్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న లోకేష్..ఇదే సమయంలో వైసీపీ పాలనపైనా.. ఆపార్టీ కీలక నేతలపైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి నారా లోకేష్ కానీ, చంద్రబాబు కానీ ఏదైనా అంటే.. వెంటనే విరుచుకుపడే వైసీపీ నాయకులు.. ప్రస్తుతం లోకేష్ చేస్తున్న కామెంట్లపై మాత్రం నోరు విప్పడం లేదు.
ఒకరకంగా చెప్పాలంటే.. వైసీపీ కి ఉన్న మొత్తం ఫైర్ బ్రాండ్స్ అందరూ కూడా మౌనంగా మారిపోయారు. కుప్పంలో ప్రారంభించిన యువగళం పాదయాత్ర.. కీలకమైన పలమనేరు, పీలేరు మీదుగా సాగి.. చంద్ర గిరి, తిరుపతిలోనూ ముందుకువెళ్లింది. ఆయా సందర్భాల్లో నారా లోకేష్ విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి వంటివారిపై కామెంట్లు చేశారు.
పుంగనూరు నియోజకవర్గానికి మంత్రి పెద్దిరెడ్డి ఏం చేశారో.. చర్చించేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరా రు. ఇక భూమన కరుణాకర్‌రెడ్డి సమాజంలో మంచి వ్యక్తి అని పేరు తెచ్చుకునేందుకు… తన కుమారుడిని అడ్డగోలుగా వాడుకుంటున్నాడని.. ఇద్దరూ కలిసి టీటీడీ దర్శనం టికెట్లు అమ్ముకుంటున్నారని వ్యాఖ్యా నించారు. మరి ఇంతగా నారా లోకేష్ రెచ్చిపోయినా.. వైసీపీ ఫైర్ బ్రాండ్స్ నోరు ఎత్తక పోవడానికి రీజనేంటి? అనేది ఆసక్తిగా మారింది.
నారా లోకేష్‌కు తాము కౌంటర్లు ఇస్తే.. మరింత పలచన అవుతామని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. కెలికి ఇంకా కంపు చేసుకోవడం ఎందుకని వారు మిన్నకుంటున్నారు. అంతేకాదు.. చేస్తున్న బాగోతం ఎక్కడ బయటకు వస్తుందోనని.. వారు తల్లడిల్లుతున్నారు. ఈ క్రమంలోనే లోకేష్‌కు ఎదురు నిలిస్తే.. ఆయనకు కౌంటర్ ఇస్తే.. మరింతగా ఇబ్బందులు తప్పవని నాయకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే.. నారా లోకేష్ ఎన్ని విమర్శలు చేసినా.. నాయకులు మాత్రం మౌనంగా ఉంటున్నారనేది టీడీపీ నేతల మాట.