లోకేష్ వైసీపీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. అధికార అండతో రెచ్చిపోతున్నావు, నీ ఫ్యాన్ రెక్కలు విరిచేస్తాం.
క్రూర బుద్ధి ఉన్న నీకు ముఖ్యమంత్రి పదవిలో ఉంటే కాస్త బుద్ధిగా ఉంటావనుకున్నా కానీ లేవు, అందుకే నువ్వు డ్రగ్గిస్ట్ అంటూ లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ హెచ్చరించారు.
ఇప్పటివరకూ ముఖ్యమంత్రి అని గౌరవించి గారూ అనేవాడిని. నీ వికృత, క్రూర బుద్ధి చూశాక సైకో, శాడిస్ట్, డ్రగ్గిస్ట్
@ysjagan అని అంటున్నాను. నువ్వూ, నీ బినామీలు డ్రగ్స్ బిజినెస్ చేస్తారు. నిలదీసే టిడిపి నేతలపై దాడులకు పాల్పడతావా?
పరిపాలించమని ప్రజలు అధికారం అందిస్తే… పోలీసుల అండతో మాఫియా సామ్రాజ్యం నడుపుతావా? టిడిపి కేంద్రకార్యాలయాలపై గూండా మూకలతో దాడులకు తెగబడతావా? ఎన్నాళ్లిలా ఇంట్లో దాక్కుని నీ కుక్కలతో దాడులు చేయిస్తావు! నువ్వే రా తేల్చుకుందాం.
తెలుగుదేశం సహనం చేతకానితనం అనుకుంటున్నావా? నీ పతనానికి ఒక్కో ఇటుకా నువ్వే పేర్చుకుంటున్నావు. నిన్ను ఉరికించి కొట్టడానికి తెలుగుదేశం అధికారంలోకి రావాల్సిన అవసరంలేదు. నీ అరాచకాలపై ఆగ్రహంగా వున్న కేడర్‌కి మా లీడర్ కనుసైగ చేస్తే చాలు.
నీ కార్యాలయాల విధ్వంసం నిమిషం పని. నీ ఫ్యాన్ రెక్కలు మడిచి విరిచి నీ పెయిడ్ ఆర్టిస్టుల్ని రాష్ట్రం దాటేంతవరకూ తరిమి కొడతారు మా కార్యకర్తలు. అన్ని ఆనవాయితీలని బ్రేక్ చేసి, ప్రజాస్వామ్యానికి పాతరేసి..నీ సమాధికి నువ్వే గొయ్యి తవ్వుకుంటున్నావు కోడికత్తిగా.
ఇప్పటివరకూ ముఖ్యమంత్రి అని గౌరవించి గారూ అనేవాడిని. నీ వికృత, క్రూర బుద్ధి చూశాక సైకో, శాడిస్ట్, డ్రగ్గిస్ట్ @ysjagan అని అంటున్నాను. నువ్వూ, నీ బినామీలు డ్రగ్స్ బిజినెస్ చేస్తారు. నిలదీసే టిడిపి నేతలపై దాడులకు పాల్పడతావా?(1/4)#YCPTerroristsAttack pic.twitter.com/Zw5z0nz4mc
— Lokesh Nara (@naralokesh) October 19, 2021