• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

డీజీపీయా.. వైసీపీ ప్రతినిధా?

NA bureau by NA bureau
October 20, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
డీజీపీయా.. వైసీపీ ప్రతినిధా?
0
SHARES
409
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
  • ‘చిల్లర’ రాజకీయాలు ఐపీఎస్‌కు ఎందుకు?
  • దిశ చట్టం లేదని చెప్పడానికి రెండేళ్లా?
  • రేపిస్టులను పట్టుకోలేక మీడియాపై అక్కసు
  • సవాంగ్‌ తీరుపై పోలీసు అధికారుల విస్మయం

నవ్యాంధ్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతున్నారన్న విమర్శలు రాజకీయ పార్టీల నుంచే కాదు.. పోలీసు వర్గాల నుంచీ వస్తున్నాయి. వైసీపీ చెప్పినట్టల్లా ఆయన ఆడుతున్నారని విపక్ష టీడీపీ విరుచుకుపడుతోంది. ఆయన తీరు, వ్యాఖ్యలు అఖిల భారత అధికారుల స్థాయిలో లేవని రిటైర్డ్‌ పోలీసు అధికారులు కూడా అంటున్నారు.

రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరించకపోయినా.. కనీసం అలా కనిపించాలన్న వివేకం కూడా ఆయనలో నశించిందని ఆక్షేపిస్తున్నారు. ఎన్ని సార్లు హైకోర్టు ముందు చేతులు కట్టుకుని నిలబడినా ఆయనకు సిగ్గనిపించడం లేదని.. పదే పదే అవే తప్పులు చేస్తున్నారని మండిపడుతున్నారు. కోర్టులను కూడా తప్పుబట్టే స్థితికి దిగజారారని అంటున్నారు.

రాజకీయాంశాల్లో అనవసరంగా తలదూర్చి.. అధికార పార్టీ ప్రతినిధిలా స్పందిస్తున్నారు. రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు కూడా. ఉదాహరణకు.. దిశ చట్టమే తీసుకుందాం. తెలంగాణలో  కామాంధుల ఉన్మాదానికి బలైన ఓ యువతి పేరిట ఆంధ్రప్రదేశ్‌లో ఈ బిల్లును హడావుడిగా తీసుకొచ్చారు. కేంద్రం జాతీయ స్థాయిలో తీసుకొచ్చిన నిర్భయ చట్టంలోని నిబంధనలను కూడా తోసిరాజనేలా దీనిలో నిబంధనలను పొందుపరిచారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా రూపకల్పన చేశారు. అసెంబ్లీలో మందిబలం ఉంది కాబట్టి ఆమోదింపజేసుకున్నారు.

భారత శిక్షాస్మృతి(ఇండియన్‌ పీనల్‌ కోడ్‌-ఐపీసీ)లో సవరణలు చేసే అధికారం తనకు లేకపోయినా రాష్ట్రప్రభుత్వం ఇందుకు సాహసించడాన్ని సవాంగ్‌ అడ్డుకోలేకపోయారు. దిశ చట్టం ప్రకారం.. అత్యాచార ఘటన జరిగి.. కేసు నమోదైన వారంలోగా కోర్టులో చార్జిషీటు వేయాలి. దానిపై 21 రోజుల్లో విచారణ పూర్తయి.. శిక్షలు పడాలి. ఇవి సాధ్యమేనా? ఆచరణాత్మకంగా అనేక లోపాలు ఉండబట్టే కేంద్రం ఇంతవరకు ఆమోదించలేదు. అనేక సందేహాలు వ్యక్తంచేస్తోంది. దానికి జగన్‌ సర్కారు సంతృప్తికరంగా జవాబివ్వలేకపోతోంది. పైగా ఈ రెండేళ్లలో జరిగిన అత్యాచార ఘటనల్లో ఒక్క కేసులో కూడా వారం రోజుల్లోగా చార్జిషీటు సంగతి దేవుడెరుగు.. నిందితులనే అరెస్టు చేసిన పాపాన పోలేదు.

సీఎం నివాసానికి కూతవేటు దూరంలో తాడేపల్లి కృష్ణాతీరంలో ఓ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులను 3నెలలు కావస్తున్నా అరెస్టు చేయలేదు. దీనిపై ప్రతిపక్షం ఆందోళనకు దిగితే ఎక్కడికక్కడ టీడీపీ నేతలను అరెస్టు చేశారు. ఉనికిలోనే లేని దిశ చట్టం ఆధారంగా దిశ పోలీసు స్టేషన్ల ఏర్పాటు తగదని ప్రభుత్వానికి డీజీపీ చెప్పలేకపోయారు. పైగా వాటి ప్రారంభోత్సవానికి ఆయనే వెళ్లడం హాస్యాస్పదంగా ఉంది. అన్నిటినీ మించి ఈ చట్టం కింద దాఖలైన కేసుల్లో ముగ్గురికి ఉరి శిక్ష పడిందని. ఐదుగురికి యావజ్జీవ శిక్ష పడిందని హోం మంత్రి సుచరిత ప్రకటించారు.

లేని చట్టం కింద శిక్షలు పడవన్న సంగతి ఆమెకు తెలియదని అనుకుందాం. డీజీపీకి తెలుసు కదా! ఆయనెందుకు వివరణ ఇవ్వలేదు. ఇదే ప్రశ్న మీడియా అడిగితే.. కోర్టులను అడగాలని ఆయన బదులిచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీలో చెప్పిన విధంగా 21రోజుల్లో ఎంతమందికి శిక్ష పడిందని అడుగగా.. దానికి ప్రత్యేక కోర్టులు అవసరమని.. ప్రభుత్వం చేయాల్సిన పని చేసిందని, కోర్టుల ఏర్పాటు కోసం న్యాయవ్యవస్థకు ప్రభుత్వం లేఖ రాసిందని వాటిని తప్పుపట్టే ప్రయత్నం చేశారు.

బిల్లు ఆమోదం పొంది చట్టరూపం దాల్చకుండా దాని కింద కోర్టులు విచారణ జరపవన్న కనీస జ్ఞానం కూడా ఆయనకు లేకపోవడం గమనార్హం. 21 రోజుల్లో శిక్షలు వేస్తామని కోర్టులు ఎప్పుడైనా చెప్పాయా? ఆ వ్యవధిలో శిక్షలు పడేలా చేస్తామని ముఖ్యమంత్రి, హోం మంత్రి, డీజీపీ, వైసీపీ మంత్రులు పదేపదే చెప్పారు. అసెంబ్లీలో చట్టాలు చేశామని చెప్పారు.

చట్టం తెచ్చినందుకు మహిళా ఎమ్మెల్యేలతో సన్మానాలు చేయించుకుని ఫొటోలు వేయించుకున్నారు. ఇప్పుడు కోర్టులను అడగమని చెప్పడం ఏమిటి? దిశ చట్టం అమల్లో లేదని గుంటూరు ఎస్పీ ధైర్యంగా చెప్పారు. డీజీపీ ఆ మాట చెప్పలేకపోయారు. ఆయన తన మాటలతో, చర్యలతో తన సొంత శాఖ పరువు తీస్తున్నారని సీనియర్‌ అధికారులు అంటున్నారు.

డీజీపీకే చట్టాల గురించి తెలియకపోతే ఆ శాఖలో ఇతరులకు ఎలా తెలుస్తాయని ప్రశ్నిస్తున్నారు. తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తే సరికి కొద్ది రోజుల కింద దిద్దుబాటకు డీజీపీ ప్రయత్నించారు. ‘దిశ’ అనేది చట్టం కాదని.. మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన కార్యక్రమమని సావకాశంగా సెలవిచ్చారు. ఇదే విషయం హోం మంత్రికి చెప్పి ఉంటే మీడియా ఎదుట ఆమె అబద్ధం చెప్పి ఉండేవారు కాదు కదా!

తాడేపల్లి రేప్‌ కేసులో నిందితులను పట్టుకోలేకపోవడానికి మీడియా కారణమని కొత్తగా ఆరోపణలు చేశారు. నిందితుల ఫొటోలను పత్రికలు ప్రచురించాయని.. అందుకే అరెస్టులో జాప్యం జరుగుతోందని చెప్పారు. దానికీ దీనికీ ఏం సంబంధమో అర్థమే కాదు.

టీడీపీపై అక్కసు..
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తనను కాదని ఆర్‌పీ ఠాకూర్‌ను డీజీపీగా నియమించడంతో సవాంగ్‌ కోపంతో ఉడికిపోయారు. అందుకే ఎన్నికల సమయంలో వైసీపీకి సహకరించారు. జగన్‌ అధికారంలోకి రాగానే ఆయనకు డీజీపీ పదవి కట్టబెట్టారు. ఆయన రుణం తీర్చుకోవడానికి సవాంగ్‌ తెగకష్టపడుతున్నారు.
టీడీపీ నేతల అక్రమ అరెస్టుల గురించి అడిగితే.. మీ హయాంలో కూడా జరిగాయని వికృత సమాధానాలు ఇస్తున్నారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై జగన్‌ సర్కారు పెట్టని కేసు లేదు. చివరకు ఆయన్ను గంజాయి కేసులో కూడా ఇరికించాలని చూశారు. ఆయన రాత్రిపూట విశాఖ వెళ్తుంటే నర్సీపట్నం పోలీసులు అరెస్టుచేసి.. ఏలూరు పోలీసులకు కబురంపారు. వారు రాత్రికి రాత్రి అక్కడకు వెళ్లి ఆయన్ను తీసుకొచ్చారు. ఏ కేసులో అరెస్టుచేయాలో తెలియక 41ఏ నోటీసు ఇవ్వడానికి అక్కడి నుంచి తీసుకొచ్చామని పచ్చి అబద్ధం చెప్పారు.
ఇదే విషయం డీజీపీని ప్రశ్నిస్తే.. 1995 నుంచి మహిళలపై దాడులతోపాటు 84 కేసులు ఆయనపై ఉన్నాయంటూ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. నిజానికి ఈ కేసుల్లో ఎక్కువ పోలీసులు పెట్టినవే. పోలీసు సిబ్బందితో ఫిర్యాదులు చేయించి కేసులు నమోదుచేయించారు. ప్రతి రోజూ ఆయనపై ఎక్కడో ఒక చోట ఎస్సీ, ఎస్టీ కేసు పెడుతున్నారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై ఉన్న కేసుల గురించి పవర్‌పాయింట్‌లో చెప్పిన సవాంగ్‌.. వైసీపీ నేతలపై కేసుల గురించి అడిగితే నోరెత్తరు.  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నెల్లూరులో ప్రభుత్వ మహిళా అధికారిపై దాడి చేసిన కేసు దర్యాప్తు.. ఇటీవల గుంటూరులో అంబటి రాంబాబుతో తనకు ముప్పుందన్న మహిళకు రక్షణ.. విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ సెక్స్‌ వ్యాఖ్యల ఆడియో విషయమై నిజానిజాల వెలికితీత గురించి మీడియా అడుగగా.. ఆయా కేసుల వివరాలు తనవద్ద లేవంటూ సమాధానం దాట వేశారు.
Tags: ap dgpDGPycpycp attacks on tdp officesYSRCP
Previous Post

ఫ్యాన్ రెక్కలు విరిచేస్తాం : జగన్ కి లోకేష్ వార్నింగ్

Next Post

జగన్ నువ్వేమీ శాశ్వత ముఖ్యమంత్రివి కాదు – కె.నాగేశ్వర్

Related Posts

టికెట్ రేట్లపై వారిని మాట్లాడొద్దంటున్న ప్రముఖ నిర్మాత
Movies

ఫేక్ కలెక్షన్లు నిజమేనంటోన్న స్టార్ ప్రొడ్యూసర్?

May 21, 2022
విన్నారా?…జగన్ బెయిల్ రద్దయితే జగన్ కే ఎక్కువ లాభమట
Andhra

జగన్ ఎవరి దత్తపుత్రుడో చెప్పిన సీపీఐ నారాయణ

May 21, 2022
జగన్ లండన్ జర్నీ చాలా కాస్ట్లీ గురూ…ఎంత తగలేశారో తెలుసా?
Andhra

జగన్ లండన్ జర్నీ చాలా కాస్ట్లీ గురూ…ఎంత తగలేశారో తెలుసా?

May 21, 2022
చేతకాని వాళ్లు అసెంబ్లీలో కూర్చోవడం ఎందుకు? జగన్ పై పవన్ తీవ్ర వ్యాఖ్యలు
Andhra

మ‌ళ్లీ త‌డ‌బ‌డిన ప‌వ‌న్‌.. ఇలా అయితే ఎలా సామీ..!

May 21, 2022
ఫిల్మ్ ఫెస్టివల్లో మ‌హిళ న‌గ్న నిర‌స‌న‌.. రీజ‌న్ ఇదేనా?
Around The World

ఫిల్మ్ ఫెస్టివల్లో మ‌హిళ న‌గ్న నిర‌స‌న‌.. రీజ‌న్ ఇదేనా?

May 21, 2022
అల్లు అర్జున్ ఎంత కట్నం తీసుకున్నాడంటే…
Movies

అల్లు అర్జున్ ఎంత కట్నం తీసుకున్నాడంటే…

May 21, 2022
Load More
Next Post
K Nageswar

జగన్ నువ్వేమీ శాశ్వత ముఖ్యమంత్రివి కాదు - కె.నాగేశ్వర్

Please login to join discussion

Latest News

  • ఫేక్ కలెక్షన్లు నిజమేనంటోన్న స్టార్ ప్రొడ్యూసర్?
  • జగన్ ఎవరి దత్తపుత్రుడో చెప్పిన సీపీఐ నారాయణ
  • జగన్ లండన్ జర్నీ చాలా కాస్ట్లీ గురూ…ఎంత తగలేశారో తెలుసా?
  • మ‌ళ్లీ త‌డ‌బ‌డిన ప‌వ‌న్‌.. ఇలా అయితే ఎలా సామీ..!
  • ఫిల్మ్ ఫెస్టివల్లో మ‌హిళ న‌గ్న నిర‌స‌న‌.. రీజ‌న్ ఇదేనా?
  • అల్లు అర్జున్ ఎంత కట్నం తీసుకున్నాడంటే…
  • లండన్ లో జగన్ ‘మనీ’ ల్యాండింగ్?…ఏకిపారేసిన యనమల
  • సిక్కోలు కోటలో సింగంలా లోకేశ్…రెస్పాన్స్ అదిరింది
  • ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి: బాల‌య్య మెసేజ్ ఇదే!
  • కార్యకర్తలకు చంద్రబాబు వార్నింగ్…చర్యలు తప్పవట
  • రాజ్య సభ సీటు రేటుపై వైసీపీ ఎంపీ ‘బీద’ పలుకులు
  • రాయలసీమ లో బాబుకు బ్రహ్మరథం!!
  • NRI TDP USA-బోస్ట‌న్ మ‌హానాడుకు స‌ర్వం సిద్దం!
  • ఇక కేసీఆర్ పై పవన్ ‘యాక్షన్’షురూ…ఆయనే డైరెక్టర్
  • ఆ మల్లెపూలేయ్…మంత్రులపై అయ్యన్న సెటైర్లు వైరల్
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds