విశాఖపట్నం జిల్లాలో టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయాలు దుమారం రేపుతున్నాయి. ఎన్నికలకు సమయం ఇంకా ఉన్న నేపథ్యంలోనే ఇరు పక్షాల మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతోంది. ఇటీవల నారా లోకేష్ ఇక్కడ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఉద్దేశించి.. గుడ్డు మంత్రి.. అంటూ.. గుడ్డును కానుకగా ఇస్తానంటూ.. లోకేష్ ప్రకటించారు. దీంతో లోకేష్‌కు కౌంటర్‌గా..ఆయనపై అమర్నాథ్ విమర్శలు గుప్పించారు.
దీంతో, అమర్నాథ్ కు కౌంటర్ గా స్థానిక టీడీపీ నాయకులు..అమర్నాథ్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి మరీ.. వాటిపై కోడిగుడ్లతో దాడులు చేశారు. నారా లోకేష్‌ను విమర్శించే స్థాయి అమర్నాథ్ కు లేదంటూ.. కామెంట్లు చేశారు. దాంతో, టీడీపీ నేతలకు కౌంటర్ గా మంత్రి అమర్నాథ్ వర్గీయులు లోకేష్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి లోకేష్‌కు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. అయితే, ఇరు వర్గాల మధ్య రాజుకున్న వివాదాలను సరిదిద్దవలసిన పోలీసులు.. ఎక్కడా పట్టించుకోవడం లేదు.
మరి ఎన్నికలకు ముందు ఇవి మరింత పెరుగుతాయో.. లేక.. ఇక్కడితో అయినా ఆగుతాయో చూడాలి. అయితే.. ఈ వివాదాలు పెరిగితే.. అటు నారా లోకేష్‌కు, ఇటు మంత్రి అమర్నాథ్కు పెద్దగా పోయేది ఏమీ లేదు. కానీ, క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు మాత్రం బద్నాం అవుతారు.. ఘర్షణలకు దిగుతారు.. కేసుల ఉచ్చులో చిక్కుకుని అల్లాడతారు.