టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నారా లోకేశ్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్నారు. విశాఖపట్టణం విమానాశ్రయానికి చేరుకున్న లోకేశ్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పలాస వెళ్తుండగా శ్రీకాకుళం సమీపంలో జాతీయ రహదారిపై అడ్డుకున్నారు.
దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
పోలీసుల వైఖరిని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు, నాయకులు ఆందోళనకు దిగారు. లోకేశ్‌పాటు మాజీ మంత్రులు కళా వెంకట్రావు, చినరాజప్ప, ఇతర నేతలు రోడ్డుపైనే నిరసన తెలిపారు.
పోలీసులు, టీడీపీ శ్రేణులకు మధ్య స్వల్పంగా తోపులాట జరిగింది.
దీంతో టీడీపీ కార్యకర్తలతోపాటు, ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లోకేశ్, చినరాజప్ప, కళా వెంకట్రావు తదితరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎచ్చెర్ల సమీపంలోని జేఆర్‌పురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అనంతరం లోకేశ్ ను విశాఖ సమీపంలో వదిలేశారు.
- అమిత్ షా: తెలంగాణతో పాటు ఏపీనీ హీటెక్కిస్తున్న మోదీ కుడి భుజం
- అనసూయ భలే ఇరుక్కుందే…
- సీఎం సారుకు అందుకే ఆమె నచ్చింది
అక్కడ Nara Lokesh ప్రెస్‌మీట్‌ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో లోకేష్, టీడీపీ శ్రేణుల వాగ్వాదానికి దిగాయి. ప్రెస్‌మీట్ జరగకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పోలీసుల తీరుకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తల నినాదాలు చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత తమపై ఉందని లోకేష్ స్పష్టం చేశారు.
సమస్యలపై ప్రభుత్వాన్ని తాము నిలదీస్తే.. అడుగడుగునా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కేవలం జేసీబీలకే పని దొరుకుతోందని, టీడీపీ నేతల ఆస్తులను జేసీబీలతో కూల్చడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
దేవాలయం ప్రహరీలను కూడా జేసీబీలతో కూల్చివేసే పరిస్థితికి వచ్చారని దుయ్యబట్టారు.
ఏపీ ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని, అన్నిరకాల పన్నులతో పాటు చెత్త పన్నును కూడా వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
మంత్రి అప్పలరాజు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో చెప్పాలి? అని ప్రశ్నించారు.
‘‘నేనేమన్నా టెర్రరిస్టునా?.. ఎందుకంత భయపడుతున్నారు?.. జిల్లాలో నా పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారు?’’ అని నారా లోకేష్ ప్రశ్నించారు.