సేవా కార్యక్రమాల్లో తనకంటూ.. ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ మహిళా పారిశ్రామిక వేత్త, టీడీపీ అధినే త చంద్రబాబు సతీమణి.. నారా భువనేశ్వరి.. ఎక్కడ ఎలాంటి విపత్తు వచ్చినా.. క్షణాల్లో స్పందిస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల తుఫాను, వరదల కారణంగా.. కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపో యి.. ఏకంగా.. మూడు జిల్లాల్లో వరదలు వచ్చాయి. ఫలితంగా వేల సంఖ్యలో ప్రజలు ఇల్లు, ఆస్తులు కోల్పోయి.. కట్టుబట్టలతో బాధితులుగా మారారు. వీరిని ఆదుకునేందుకు భువనేశ్వరి.. ముందుకు వచ్చారు.
స్థానికంగా ఉన్న టీడీపీ సైన్యాన్ని రంగంలోకి దింపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్న నారా భువనేశ్వరి.. ఆ ట్రస్టు ఆధ్వర్యంలో ఆహారం, నీరు, వస్త్రాలు, బియ్యం, నిత్యవసరాలు, కిరోసిన్, గ్యాస్ బండలు(ఐదు కేజీలు)ను పంపిణీ చేశారు.
ఎక్కడ ఎవరు బాధితులు ఉన్నా.. ఆదుకునేలా కార్యక్రమాలు రూపొందించి సమర్ధవంతంగా ప్రభుత్వం కంటే ముందుగా.. టీడీపీ సైన్యాన్ని రంగంలోకి దింపి.. సాయం అందించారు. ఇప్పుడు మరోసారి తన ఉదారతను చాటుకునేందుకు భువనేశ్వరి.. ముందుకు వచ్చారు.
వరదల కారణంగా.. సర్వస్వం కోల్పోయిన బాధితుల కుటుంబాలకు.. ముఖ్యంగా వరదల్లో కొట్టుకుపోయిన వారి ప్రతి కుటుంబానికీ రూ.లక్షను అందించేందుకు ముందుకు వచ్చారు. మొత్తం 48 మంది వరదల్లో కొట్టుకుపోయి.. ఇతర త్రా కారణాలతో మృతి చెందారు.
వీరి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఒక్కొక్క కుటుంబానికీ రూ.లక్ష ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 20న ఆమె.. ఈ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించనున్నారు. ఇప్పటికే సంబంధిత కుటుంబాలకు సమాచారం అందించారు. మొత్తానికి నారా భువనేశ్వరి సేవా దృక్ఫదానికి ప్రతి ఒక్కరూ.. హ్యాట్సాఫ్ చెబుతున్నారు.