కుటుంబాన్ని మొత్తం తిట్టిన మెగా కుటుంబానికి చీమ కుట్టినట్టు కూడా లేదు.
వారిలో జగన్ అంటే ఇంత భయం ఉందని తాజా ఎపిసోడ్ తోనే అర్థమవుతోంది
పవన్ ను వైసీపీ నేతలు, సినిమా వాళ్లు తిడుతుంటే మెగా కుటుంబం నోరు మెదపడం లేదు.
జగన్ కి అనుకూలంగా మాట్లాడేవారికి లేని భయం… పవన్ కు మద్దతు ఇవ్వడానికి చిరు కుటుంబానికి ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదు ఎవరికీ.
సినిమాల్లో అవకాశాలు లేక… వైసీపీ కార్యకర్తగా మారిన పోసాని పవన్ కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగడం ఎవరికీ నచ్చలేదు.
ఎవరో తా ను పవన్ ఫ్యాన్ అని చెప్పుకుని బూతులు తిట్టినంత మాత్రాన పోసాని పవన్ ను తిట్టడం ఎవరికీ రుచించడం లేదు. చివరకు టీడీపీ వాళ్లు కూడా అయ్యో ఇలా తిడుతున్నారేంటి అని సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు గాని మెగా కుటుంబం మాత్రం నోరు మూసుకుని కూర్చుంది.
అప్పట్లో బాలకృష్ణపై నోరేసుకుని పడిపోయిన నాగబాబు ఇపుడు ఎందకు అంటీముట్టనట్టు ఉన్నారు ? ఇంత జరుగుతుంటే సోషల్ మీడియాలో నాగబాబు స్పందించారు. అది కూడా చాలా నార్మల్గా భయంగా స్పందించారు.
ఆయన స్పందన ఎలా ఉందో ఈ వీడియోలో చూడొచ్చు.