ప్రముఖ సినీ నటి కమ్ ప్రత్యేక గీతాల్లో మెరిసే ముమైత్ ఖాన్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఆమె రాక అక్కడి వారితో పాటు.. స్థానిక మీడియాలోనూ సంచలనంగా మారింది. ముమైత్ పోలీస్ స్టేషన్ కు వచ్చారన్న విషయం తెలిసి ఉరుకులు పరుగులు తీసుకుంటూ మీడియా వెళ్లింది.
రెండు రోజుల క్రితం క్యాబ్ డ్రైవర్ రాజు అనే వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ కావటం తెలిసిందే. ముమైత్ ను గోవాకు తీసుకెళ్లానని.. తనను రెండు రోజులు ఉంచి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారంటూ ముమైత్ ఖాన్ మీద ఆరోపణలు చేస్తూ.. పోస్టు పెట్టాడు.
ఇది కాస్తా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై ముమైత్ రియాక్టు అవుతూ నేరుగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఒక కంప్లైంట్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. డ్రైవర్ రాజు తో తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. అతడు తనను బెదిరింపులకు గురి చేస్తున్నాడని.. బ్లాక్ మొయిల్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అతనికి ఇవ్వాల్సిన డబ్బులన్ని తాను ఇచ్చినట్లు ఆమె చెప్పారు.
పేమెంట్ విషయమై.. క్యాబ్ మేనేజర్ తో పాటు.. వారి ఫ్యామిలీకి తాను కంప్లైంట్ చేశానని చెప్పారు. పోనీలే.. పేదవాడు అని వదిలిపెడితే తనపై ఆరోపణలు చేస్తున్నాడని.. అబద్ధాలు చెబుతున్నాడని ఆమె మండిపడ్డారు. డ్రైవర్ రాజుపై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీసుల్ని కోరినట్లుగా ఆమె చెప్పారు. ముమైత్ రాకతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర సందడి నెలకొంది.