వృద్ధ కాపు నేత ముద్రగడ పద్మనాభం వ్యవహారం ఇప్పుడు ఆంధ్రా రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఆయన చాలా ఏళ్ల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పరోక్ష మద్దతుదారుగా ఉంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన పోరాటం తెలుగుదేశం ప్రభుత్వం మీదే నడిచింది.
2019 ఎన్నికల తర్వాత ఆయన మౌనం వహిస్తున్నారు. కానీ జగన్ సర్కారును పల్లెత్తు మాట అనకపోవడాన్ని బట్టి ఆయన మద్దతు వైసీపీకే అన్నది స్పష్టం. ఐతే ఎన్నికల ముంగిట ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల సానుకూలతతో ఉన్నట్లు కనిపించారు. పవన్ మంచి కోరుతూ లేఖలు రాశారు. కానీ తెలుగుదేశంతో పొత్తులో భాగంగా ఆయన చేయమన్న డిమాండ్ల పట్ల పవన్ సానుకూలంగా స్పందించలేదు. ఈ కారణం చూపి ఆయన వైసీపీలో చేరడానికి రెడీ అయిపోయారు.
తనకు సలహాలిచ్చిన వాళ్లంతా వైసీపీలోకి వెళ్లిపోతున్నారంటూ పవన్ ఎద్దేవా చేసిన వారిలో హరిరామజోగయ్యతో పాటు ముద్రగడ కూడా ఉన్నారు. కాగా ఏ షరతులూ లేకుండా వైసీపీలో చేరుతున్నానంటూ మూడు రోజుల కిందటే ప్రకటన చేశారు ముద్రగడ. అంతే కాక బుధవారం నాడు తన స్వగృహం నుంచి తాడేపల్లి వరకు వేల మంది కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి సీఎం జగన్ను కలిసి వైపీపీలో చేరతానని ప్రకటన ఇచ్చారాయన.
తన వెంట వచ్చేవాళ్లు సొంతంగా భోజన ఏర్పాట్లు చేయాలంటూ ఆయన పేర్కొనడం కూడా చర్చనీయాంశం అయింది. కానీ ఇప్పుడు ఆయన పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఎక్కువమంది జనాలతో వెళ్తే సెక్యూరిటీ సమస్యలు వస్తాయని భావించి ఈ ర్యాలీని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. తాను ఒక్కడినే వెళ్లి జగన్కు కలిసి వైసీపీలో చేరతానని.. 15న లేదా 16న ఆ కార్యక్రమం ఉంటుందని ప్రకటించారు. ఐతే ఒక నేత ర్యాలీగా వెళ్తే అంత సమస్య ఉంటుందా అని సందేహాలు వ్యక్తం చేస్తున్న జనాలు.. ఇందులో ఏదో మతలబు ఉందని.. ముద్రగడ విషయంలో జగన్ అంత ఆసక్తితో లేరా లేక వైసీపీ ట్రీట్మెంట్ నచ్చక ముద్రగడ ఇలా చేస్తున్నారా అనే ప్రశ్నలు వేస్తున్నారు.
ముద్రగడ కి జగన్ ఝలక్..ఇపుడు కాదు తరవాత రా.. || CM Jagan shock to Mudragada Padmanabham || ABN#mudragadapadmanabham #cmjagan #abntelugu pic.twitter.com/xnxFboZIH2
— ABN Telugu (@abntelugutv) March 13, 2024
#MudragadaPadmanabham మీ లాంటి వాళ్లకి వైసీపీనే కరెక్ట్..#PawanKalyan pic.twitter.com/ZbUht0Hbvt
— Sushma (@SushmaJSP) March 7, 2024