• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ముద్రగడ.. ఇదేం ట్విస్టయ్యా

NA bureau by NA bureau
March 13, 2024
in Andhra, Politics, Top Stories, Trending
0
mudragada padmanabham

mudragada padmanabham

0
SHARES
249
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వృద్ధ కాపు నేత ముద్రగడ పద్మనాభం వ్యవహారం ఇప్పుడు ఆంధ్రా రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఆయన చాలా ఏళ్ల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పరోక్ష మద్దతుదారుగా ఉంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన పోరాటం తెలుగుదేశం ప్రభుత్వం మీదే నడిచింది.

2019 ఎన్నికల తర్వాత ఆయన మౌనం వహిస్తున్నారు. కానీ జగన్ సర్కారును పల్లెత్తు మాట అనకపోవడాన్ని బట్టి ఆయన మద్దతు వైసీపీకే అన్నది స్పష్టం. ఐతే ఎన్నికల ముంగిట ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల సానుకూలతతో ఉన్నట్లు కనిపించారు. పవన్ మంచి కోరుతూ లేఖలు రాశారు. కానీ తెలుగుదేశంతో పొత్తులో భాగంగా ఆయన చేయమన్న డిమాండ్ల పట్ల పవన్ సానుకూలంగా స్పందించలేదు. ఈ కారణం చూపి ఆయన వైసీపీలో చేరడానికి రెడీ అయిపోయారు.

తనకు సలహాలిచ్చిన వాళ్లంతా వైసీపీలోకి వెళ్లిపోతున్నారంటూ పవన్ ఎద్దేవా చేసిన వారిలో హరిరామజోగయ్యతో పాటు ముద్రగడ కూడా ఉన్నారు. కాగా ఏ షరతులూ లేకుండా వైసీపీలో చేరుతున్నానంటూ మూడు రోజుల కిందటే ప్రకటన చేశారు ముద్రగడ. అంతే కాక బుధవారం నాడు తన స్వగృహం నుంచి తాడేపల్లి వరకు వేల మంది కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి సీఎం జగన్‌ను కలిసి వైపీపీలో చేరతానని ప్రకటన ఇచ్చారాయన.

తన వెంట వచ్చేవాళ్లు సొంతంగా భోజన ఏర్పాట్లు చేయాలంటూ ఆయన పేర్కొనడం కూడా చర్చనీయాంశం అయింది. కానీ ఇప్పుడు ఆయన పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఎక్కువమంది జనాలతో వెళ్తే సెక్యూరిటీ సమస్యలు వస్తాయని భావించి ఈ ర్యాలీని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. తాను ఒక్కడినే వెళ్లి జగన్‌కు కలిసి వైసీపీలో చేరతానని.. 15న లేదా 16న ఆ కార్యక్రమం ఉంటుందని ప్రకటించారు. ఐతే ఒక నేత ర్యాలీగా వెళ్తే అంత సమస్య ఉంటుందా అని సందేహాలు వ్యక్తం చేస్తున్న జనాలు.. ఇందులో ఏదో మతలబు ఉందని.. ముద్రగడ విషయంలో జగన్ అంత ఆసక్తితో లేరా లేక వైసీపీ ట్రీట్మెంట్ నచ్చక ముద్రగడ ఇలా చేస్తున్నారా అనే ప్రశ్నలు వేస్తున్నారు.

ముద్రగడ కి జగన్ ఝలక్..ఇపుడు కాదు తరవాత రా.. || CM Jagan shock to Mudragada Padmanabham || ABN#mudragadapadmanabham #cmjagan #abntelugu pic.twitter.com/xnxFboZIH2

— ABN Telugu (@abntelugutv) March 13, 2024

#MudragadaPadmanabham మీ లాంటి వాళ్లకి వైసీపీనే కరెక్ట్..#PawanKalyan pic.twitter.com/ZbUht0Hbvt

— Sushma (@SushmaJSP) March 7, 2024

Tags: janasenamudragadamudragada padmanabhampawan kalyanycpYSRCP
Previous Post

ముహూర్తం ఫిక్స్‌.. కొబ్బ‌రికాయ కొట్టేసిన నారా లోకేష్‌

Next Post

పవన్ కళ్యాణ్ హీరోయిన్ 40 ఏళ్లకి పెళ్లి చేసుకుంది

Related Posts

Movies

అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!

May 19, 2025
Andhra

నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్

May 19, 2025
Andhra

టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!

May 19, 2025
Movies

మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!

May 19, 2025
Andhra

విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Load More
Next Post
Meera Chopra got married at the age of 40

పవన్ కళ్యాణ్ హీరోయిన్ 40 ఏళ్లకి పెళ్లి చేసుకుంది

Latest News

  • అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!
  • నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్
  • టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!
  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra