వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ వ్యవహారాన్ని టీడీపీ నేతలు ఆధారాలతో సహా బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. గోరంట్లది ఒరిజినల్ వీడియో అని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించి మరీ గోరంట్ల గుట్టు రట్టు చేయడంతో వైసీపీ నేతలకు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే గోరంట్లది ఫేక్ వీడియో అంటూ ఇంతకాలం ప్రచారం చేస్తూ వచ్చిన వైసీపీ నేతలు తాజాగా ట్రెండ్ మార్చారు.
అసలు కథ వదిలేసి కొసరు కథను పట్టుకొని వేలాడడం మొదలుపెట్టారు. గతంలో, మహిళలపై బాలకృష్ణ అలా కామెంట్లు చేశారు, ఆయనపై చంద్రబాబు చర్యలు తీసుకోలేదు అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి మరోసారి విషం చిమ్మారు. నారా లోకేష్ అమెరికాలో ఉన్న సమయంలో ఉన్న కొన్ని పాత ఫోటోలను విజయసాయిరెడ్డి ఇప్పుడు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి విమర్శిస్తున్నారు.
ఆ ఫోటోలతో లోకేష్ పై దుష్ప్రచారం మొదలు పెట్టారు వీసా రెడ్డి. అయితే, ఆ ఫోటోలు ఫేక్ అని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇస్తున్నారు. గోరంట్ల డర్టీ వీడియో ఒరిజినల్ అని స్పష్టంగా కనిపిస్తోందని, లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసినట్టుగా కనిపిస్తున్నాయని కామెంట్లు పెడుతున్నారు. ముందు గోరంట్ల వీడియో వ్యవహారం తేల్చాలని, విజయవాడలోని ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి ఆ నివేదికను బట్టబయలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లోకేశ్ ఫేక్ ఫొటోలతో విజయసాయి పైశాచికానందం పొందడం మానాలని హితవు పలుకుతున్నారు.