అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు.. రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభు ఏపీలోని జగన్ సర్కారుపై కంప్లైంట్ చేశారు. ఒక లేఖ ద్వారా ఏపీ సర్కారుపై చర్యలు తీసుకోమని కోరారు. ఆయన లేఖలోని అంశాల్లోకి వెళితే.. రాష్ట్రాల కార్పొరేషన్లకు చెందిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించినట్లుగా ఆయన ఆరోపించారు.
జగన్ సర్కారు తీరు అభ్యంతరకరమని ఆయన పేర్కొన్నారు. ఇలా కార్పొరేషన్ల నిధుల్నిసంక్షేమ పథకాలకు మళ్లిస్తే.. ఆర్థిక పురోగతి కుంటుబడుతుందనన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తీరు డెవలప్ మెంట్ మీదా ప్రభావం చూపుతుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి జోక్యం చేసుకోవాల్సిందిగా కోరారు.
ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ పరిస్థితి చేయి దాటక ముందే.. సరైన చర్యలు తీసుకోవాలన్న ఆయన.. ‘ఏపీలో పరిస్థితి చేయి దాటక ముందే చర్యలు తీసుకోవాలి. ఎఫ్ఆర్బీఎం పరిమితిని దాటి సంక్షేమ పథకాలకు ఏపీ సర్కారు అప్పులు చేస్తోంది’’ అని ఫిర్యాదు చేశారు. సురేష్ ప్రభు గతంలో రైల్వే మంత్రిగా వ్యవహరించటం తెలిసిందే. తర్వాతి కాలంలో బీజేపీలోకి చేరిన ఆయన.. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఆయన ఏపీ కోటా కింద రాజ్యసభకు ఎన్నికయ్యారు.