viral: రాజమండ్రి - క్లాస్ రూంలో ఇంటర్ పెళ్లి

సినిమాలు, సోషల్ మీడియాతో పిల్లలకు మతి భ్రమిస్తోంది. వాటి ప్రభావంతో ఏది సీరియస్సో, ఏది కామెడీయో కూడా అర్థం కాకుండా సెల్ఫీలు, సోషల్ మీడియా పోస్టులు పెట్టి క్రేజీగా అనిపించుకోవాలని ఏదిపడితే అది చేస్తున్నారు.  వీరి అపరిపక్వతం, సామాజిక అజ్జానం తల్లిదండ్రులకు తలవంపులు తెస్తోంది.

రాజమండ్రిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ విద్యార్థులు క్లాస్ రూంలోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి పెద్ద మరో ఇంటర్ అమ్మాయి. విద్యార్థి... మరో విద్యార్థినికి కాలేజీ యూనిఫాంలోనే తాళికట్టి బొట్టుపెట్టాడు. త్వరగా కానియ్యండి ఎవరైనా చూస్తారు అని మరో అమ్మాయి వీడియో తీసింది. ఇది వైరల్ అయ్యాక ఏంట్రా ఈ పెళ్లి అంటే సరదాకి అని సింపుల్ గా చెప్పేశారు విద్యార్థులు.

ఆ ఇద్దరు విద్యార్థులకు ప్రిన్సిపాల్ టీసీ ఇచ్చి పంపేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో తల్లిదండ్రులు తీవ్రఆవేదనకు లోనవుతున్నారు. పిల్లలు చేసిన పనికి తలెత్తుకోలేక బిక్కచచ్చిపోతున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.