ఇదేం పోయేం కాలం.. ఏపీలో మరో ప్రేమోన్మాది అరాచకం


ప్రేమించిన అమ్మాయి సుఖంగా ఉండాలని.. తాను ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని భావించటం అసలుసిసలు ప్రేమికుడు లక్షణం. అందుకు భిన్నంగా.. తాను ప్రేమిస్తే.. తన సొంతం కావాలే తప్పించి.. తనకు ఇష్టం ఉందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునే అలవాటుఈ మధ్యన కొందరిలో మిస్ అవుతోంది. ఇలాంటి ప్రేమోన్మాదుల కారణంగా అమాయకులు బలైపోతున్న దుస్థితి. ఇటీవల కాలంలో ప్రేమోన్మాది ఉదంతాలు ఏపీలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

తాజాగా విశాఖలో ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. విశాఖ పాతనగరానికి చెందిన 20 ఏళ్ల యువతి ఇంటర్ వరకు చదువుకొని.. ఉద్యోగం చేస్తుంది. ఆ యువతి ఇంటి పక్కనే 23 ఏళ్ల అద్దెపల్లి శ్రీకాంత్ కుటుంబం ఉంటోంది. రెండు కుటుంబాల మధ్య చక్కటి సంబంధాలు ఉండేవి. అయితే.. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ గడిచిన ఆర్నెల్లుగా వేధిస్తున్నాడు శ్రీకాంత్.  పెళ్లి చేసుకుంటానని ఆ యువతి తల్లిదండ్రులతో మాట్లాడారు.

అయితే.. వారు అందుకు ఒప్పుకోలేదు. తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు కాబట్టి.. తాను పెళ్లి చేసుకోనని ఆ యువతి నో చెప్పేసింది. దీంతో కక్ష పెంచుకున్న శ్రీకాంత్ సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు. బుధవారం ఉదయం యువతి ఇంట్లో ఎవరూ లేరన్న విషయాన్ని గుర్తించి.. ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసేసి.. యువతి గొంతును స్టేషనరీ బ్లేడ్ తో కట్ చేశాడు. అనంతరం తన మెడను కోసుకున్నాడు.
దీంతో పెద్దగా కేకలు వేస్తూ.. బాధిత యువతి తలుపు గడియ తీసి.. పరుగులు పెడుతూ బయటకు వచ్చింది. రక్తం కారుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో గాయమైన శ్రీకాంత్ ను ఆసుపత్రికి తరలించారు. ఇరువురు పరిస్థితి బాగోలేదని వైద్యులు చెబుతున్నారు.

దీంతో.. ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రస్తుతం వైద్యులపర్యవేక్షణలో ఉన్న వారి నుంచి కాస్త కోలుకున్న తర్వాత వివరాలుసేకరిస్తామని పోలీసులు చెబుతున్నారు. ప్రేమించటం తప్పు కాదు. కానీ ప్రేమకు నో చెప్పిందని.. కక్ష పెట్టుకొని ఇలా దాడికి దిగటం మాత్రం దారుణం. ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్నాడని శ్రీకాంత్ పై అమ్మాయి తల్లిదండ్రులు గతంలో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అయినప్పటికీ.. దాడికి తెగించిన వైనం సంచలనంగా మారింది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.