టీడీపీ రథసారథి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు అరెస్టు, బెయిల్ దొరక్కపోవడంతో ఇప్పటికీ ఆయన జైలులో ఉండటం, మరిన్ని కేసులు ఆయనపై నమోదవుతుండటం తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్న సంగతి తెలిసిందే. జాతీయ రాజకీయాల్లోని పలువురు ముఖ్య నేతలు, పలు ప్రతిపక్ష పార్టీలు సైతం బాబు అరెస్టుపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. బాబు అరెస్టు అనంతరం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ ఉంటుందంటు ప్రచారం జరిగినప్పటికీ వాస్తవ రూపం దాల్చలేదు. దీని వెనుక లాజిక్ వేరే ఉందని టాక్ నడుస్తోంది.
సోషల్ మీడియాలో పలువురు పేర్కొంటున్న అభిప్రాయాల ప్రకారం, తన రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్ర బాబు నాయుడును అరెస్టు చేయించడం కేవలం తనకు మాత్రమే కాకుండా బీజేపీ ఏ విధంగా మేలు చేసే అంశమో వివరించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలిసి ఈ మేరకు ఆయ వివరించేందుకు సిద్ధమై అపాయింట్మెంట్ కోరినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రధానితో సమావేశం సమయంలో… చంద్రబాబు అరెస్టుకు దారి తీసిన అవకతవకలు, రాజకీయపరమైన అంశాలు, అరెస్టు సందర్భంగా తాను లేకపోవడం వంటి వివిధ పరిణామాలని తెలియజేయాలని జగన్ భావించరట. అయితే, ఢిల్లీ పెద్దలు మాత్రం నో చెప్పినట్లు నెటిజన్లు పేర్కొంటున్నారు.
జీ20 విజయవంతం చేసినందుకు ప్రధానికి అభినందననలు తెలిపేందుకే వైఎస్ జగన్ ఢిల్లీ విచ్చేస్తున్నారని అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించగా నిరాశ ఎదురయింది అనేది నెటిజన్ల అంచనా. చంద్రబాబు అరెస్టు అనంతరం ఇటు ఏపీలోనే కాకుండా అటు తెలంగాణ, కర్ణాటకతో పాటుగా వివిద దేశాల్లో ఆయన మద్దతుదారులు, అభిమానులు నిరసనలు వ్యక్తం చేయడం కేంద్రం దృష్టికి వచ్చిందని చెప్తున్నారు. అందుకే జగన్కు అపాయింట్మెంట్ నిరాకరించారని టాక్. అందుకే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకోలేదని చెప్తున్నారు.