లోక్ సభ ఎన్నికలకు ముందస్తు తప్పదా ? అనే చర్చ దేశమంతా పెరిగిపోతోంది. ఇందులో భాగంగానే ఇండియా కూటమిలోని పార్టీల అధినేతలు రానున్న నవంబర్ నెలలోనే ముందస్తు ఎన్నికలు జరుగుతాయని బలంగా నమ్ముతున్నారు. ఇండియా కూటమిని ఇబ్బందులు పెట్టడానికి, పార్టీలను కుదురుకోనీయకుండా దెబ్బకొట్టడానికే నరేంవ్రమోడీ జమిలి ఎన్నికల పేరుతో ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఏపీ, తెలంగాణా రాష్ట్రాలతో పాటు చాలా అసెంబ్లీలకు నవంబర్లోనే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు.
కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వాయిదాపడే అవకాశాలు ఉన్నాయని కావాలనే ఎన్డీయే పక్షాలు ప్రచారంలోకి తీసుకొస్తున్నట్లు ఇండియాకూటమి నేతలు అనుమానిస్తున్నారు. అసెంబ్లీల ఎన్నికలు ఆలస్యమవుతాయని బాగా ప్రచారం చేసి సడెన్ గా ముందస్తు ఎన్నికలకు రావటమే ఎన్డీయే అసలు లక్ష్యంగా కూటమి పెద్దలు చాలామంది బలంగా నమ్ముతున్నారు. నరేంద్రమోడీకి వ్యతిరేకంగా 28 పార్టీలు ఇండియాకూటమిగా ఏర్పడింది వాస్తవమే.
అయితే వీటిల్లో సీట్ల సర్దుబాటు విషయంలో అంతర్గతంగా చాలా గొడవలున్నాయి. పార్లమెంటు ఎన్నికల వరకు సీట్ల సర్దుబాటు అయ్యే అవకాశం ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో సర్దబాబు కష్టమనే అభిప్రాయం బాగా వినబడుతోంది. ఈమధ్యనే జరిగిన ఏడు అసెంబ్లీ స్ధానాల ఉపఎన్నికల్లో ఇండియాకూటమి కలిసికట్టుగానే పోటీచేసింది. ఏడు నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమి ముడుచోట్ల గెలిస్తే ఇండియాకూటమి నాలుగు చోట్ల గెలిచింది. ఈ ఏడు నియోజకవర్గాల్లోను ఎన్డీయే కూటమి-ఇండియాకూటమి మధ్య వన్ ఆన్ వన్ అనే పద్దతిలో ఇండియాకూటమిలోని పార్టీలన్నీ కలిసి ఒకే అభ్యర్ధిని నిలబెట్టాయి.
తొందరలో ఎన్నికలు జరగాల్సిన మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్ధాన్, తెలంగాణా, మిజోరం ఎన్నికల్లో పరిస్ధితులు బీజేపీకి పెద్ద సానుకూలంగా లేవని ప్రాపోల్ సర్వేలు చెబుతున్నాయి. ఈ సర్వేలే గనుక నిజమైతే వచ్చేఏడాది జరగబోయే పార్లమెంటు ఎన్నికలపైన కూడా పడే అవకాశముంది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల ప్రభావం రాజ్యసభ స్ధానాలపైన కూడా పడుతుంది. అందుకనే ప్రతిపక్షాలన్నింటినీ కోలుకోనీయకుండా దెబ్బకొట్టడంలో భాగంగానే జమిలి ఎన్నికలని, ముందస్తు ఎన్నికలని అయోమయంలోకి ఎన్డీయే నెట్టేస్తోందని పలువురు ఇండియాకూటమి నేతలు ప్రకటిస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో ఏమో చూడాలి.