నూతన పార్లమెంటును రాష్ట్ర పతి కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం తప్పుకాదని.. దీనిని అందరూ స్వాగతించా లని పేర్కొన్న ఏపీ సీఎం జగన్ పరాభవం ఎదురైంది. ఆయన ఎవరినైతే.. కొనియాడారో.. జగన్ ఎవరినైతే.. ప్రశంసించారో.. ఆ ప్రధానే సీఎం జగన్‌ను కనీసం కన్నెత్తి చూడలేదు. పన్నెత్తి పలకరించలేదు. పార్లమెంట్ ప్రారంభోత్సవం అనంతరం ఆహుతులను ఒక్కొక్కరిని పలకిస్తున్న సమయంలో ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ప్రధాని మోడీ పార్లమెంటులోపల కలియ దిరుగుతూ.. ఆహ్వానితులను పరిచయం చేసుకున్నారు. ఈ క్రమలో తన సీటు వద్దకు ప్రధాని రాగానే సీఎం జగన్ లేచి నిలబడి నమస్కరించారు. అయితే జగన్ పదేపదే నమస్కరిస్తున్నా మోడీ ఏ మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయారు. తిరిగి వచ్చే సమయంలో కూడా ప్రధాని కంట్లో పడేందుకు జగన్ ప్రయత్నించినప్పటికీ మోడీ కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. జగన్ పలకరిస్తున్నా.. ప్రధాని మోడీ పట్టించుకోకుండా వెళ్లిన పరిణామం ఆసక్తికరంగా మారింది. అయితే.. దీనిపై వైసీపీ నేతలు కానీ.. సీఎం జగన్ కానీ ఎలాంటి కామెంట్లు చేయలేదు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తితో భేటీ
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వచ్చి సీఎం జగన్‌తో భేటీ కావడం ఆసక్తిగా మారింది. గతంలో ఏపీ హైకోర్టు జస్టిస్‌గా పనిచేసిన మిశ్రా రెండుసార్లు వచ్చి జగన్‌ను కలిశారు. దాదాపు ఇద్దరు 4 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. మరోవైపు మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, మాజీ ప్రధాని దేవెగౌడలను సీఎం జగన్ ప్రత్యేకంగా పలకరించారు. కాగా పార్లమెంట్ ప్రారంభోత్సవానికి పది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పదిమంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ఎంపీలు, ప్రముఖులు హాజరయ్యారు. పార్లమెంట్లో జగన్ అడుగుపెట్టగానే ఏపీ ఎంపీలు స్వాగతం పలికారు.