కాంగ్రెస్ వ్యూహానికి ప్రతివ్యూహం వేశారు. ఎట్టి పరిస్థితిలోనూ మూడో సారి కూడా విజయం దక్కించుకుని కేంద్రంలో పాగా వేయాలన్న లక్ష్య సాధణ దిశగా ప్రధాని మోడీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 80 కోట్ల మంది మహిళలు వినియోగిస్తున్న వంట గ్యాస్ సిలిండర్ల కేంద్రంగా ఆయన రాజకీయ సునామీకి తెరదీశారు. ప్రస్తుతం ఉన్న వంట గ్యాస్ ధరలను కనీ వినీ ఎరుగని రీతిలో తగ్గించారు.
ప్రస్తుతం 995 రూపాయలుగా ఉన్న వంట గ్యాస్(అన్ని వర్గాలు) ధరలను ఏకంగా రూ.100 తగ్గించేశారు. ఈ మేరకు ప్రధాని తాజాగా ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా మహిళలకు ఆయన వరాన్ని ప్రకటిస్తున్నట్టు తెలిపారు. “మహిళా దినోత్సవం సందర్భంగా.. మా అక్కచెల్లెమ్మలకు, అమ్మలకు.. గొప్ప కానుక ఇస్తున్నా“ అని మోడీ పేర్కొన్నారు. వంట గ్యాస్ ధరలను రూ.100 మేరకు తగ్గిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు.. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వచ్చిందని తెలిపారు.
అంతేకాదు.. నిన్న మొన్న, ఈ వార్ంలో బుక్ చేసి, తీసుకున్న సిలిండర్లపైనా రూ.100 తగ్గింపు వర్తిస్తుంద ని.. ముందుగానే జమ చేసిన వారికి వారి వారి అకౌంట్లలో రూ.100 తిరిగి జమ అవుతుందని కూడా పేర్కొ న్నారు. ఇది దేశంలోని 60 కోట్ల మంది మహిళా మణుల ఆర్థిక ప్రగతికి చోదకంగా కూడా మారుతుందని మోడీ పేర్కొనడం గమనార్హం. ఈ నిర్ణయంతో మహిళలకు ఆర్థిక స్వావలంబన కూడా చేకూరుతుందని పేర్కొనడం గమనార్హం. కాగా.. దీనిని ఎన్నికల నిర్ణయంగా ప్రతిపక్షాలు విమర్శిస్తుండడం గమనార్హం.