ఉప ఎన్నికలను ఓట్లు కొని, బెదిరించి, పథకాల ఆశ చూపి బయపెట్టి గెలుచుకుంటూ వచ్చిన వైసీపీకి అవన్నీ మేనేజ్ చేయలేని ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో గట్టి దెబ్బ తగిలింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సహజంగా వైసీపీకే వస్తుంది. ఎందుకంటే అక్కడ సంఖ్యాబలం ఉంది.
టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైమరీ గవర్నమెంట్ టీచర్లకు ఓటు ఉండదు. ప్రైవేటు స్కూలు టీచర్లకు ఓటు ఉంటుంది. అంటే ఏపీలో ప్రైవేటు స్కూలు టీచర్ల సంఖ్య చాలా ఎక్కువ కావడం వల్ల అక్కడ కూడా ఓట్లను వైసీపీ మేనేజ్ చేసింది.
కానీ జాబ్ క్యాలెండర్ అంటూ మోసం చేసిన పట్టభద్రుల నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీకి దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చారు చదువుకున్న నిరుద్యోగులు. అక్కడ కూడా పట్టభద్రులు కాని వారికి దొంగ ఓట్లు వేయించినా పెద్ద సంఖ్యలో ఉన్న పట్టభద్రుల ముందు వైసీపీ మోసాలు నిలబడలేకపోయాయి. తమను మోసం చేసిన వైసీపీ సర్కారుకు పట్టభద్రులు బుద్ధిచెబుతున్నారు. ఎక్కడైతే మాకు బలం ఉందని వైసీపీ విర్రవీగిందో అక్కడే వైసీపీ ఓడిపోయింది.
ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ సీట్లు… మొదటి ప్రాధాన్యాతా ఓట్లతోనే తెలుగుదేశం అభ్యర్థులు వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్ గెలవబోతున్నారు ! ఒక్క పశ్చిమ రాయలసీమ మాత్రం మొదటి ప్రాధాన్యతా ఓట్లతో… స్వల్పంగా వెనుకబడి ఉంది ! రెండొవ ప్రాధాన్యతా ఓట్లతో తెలుగుదేశం అభ్యర్థి భూమిరెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఉత్తరాంధ్ర పట్టభద్రులు… ఏకపక్షంగా తెలుగుదేశం అభ్యర్థిని బలపరచడం.. ప్రభుత్వం మీద యువత, నిరుద్యోగుల వ్యతిరేకత తెలియచేస్తోంది ! విచిత్రంగా.. అధికారంలో ఉన్నప్పుడు ఈ మూడు ఎమ్మెల్సీలు తెలుగుదేశం ఖాతాలో లేవు !