• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కేసీఆర్ కు పెద్ద దెబ్బే ఇది

NA bureau by NA bureau
March 17, 2023
in Politics, Telangana, Top Stories, Trending
0
AVN Reddy

AVN Reddy

0
SHARES
295
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు షాక్ తగిలింది. ఒకవైపు కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో పాత్ర ఉందంటూ ఈడీ చేస్తున్న ఆరోపణలు.. విచారణ పేరుతో చోటు చేసుకున్న పరిణామాలు ఒత్తిడికి గురి చేస్తున్న వేళలో  జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించగా.. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి ఓటమి పాలు కావటం కచ్ఛితంగా ఎదురుదెబ్బేనని చెప్పక తప్పదు.

ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి సుమారు 1150 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ బలపర్చిన పీఆర్ టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై విజయం సాధించారు. గురువారం ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపు కార్యక్రమం శుక్రవారం ఉదయం వరకు కొనసాగుతూనే ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఏ ఒక్కరు కూడా మ్యాజిక్ ఫిగర్ అయిన 12,709 ఓట్లను దాటకపోవటం గమనార్హం.

దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును చేపట్టారు. గురువారం ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపు.. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తేల్చేసరికే సాయంత్రం అయ్యింది. ఈ సమయానికి బీజేపీ బలపర్చిన అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అయితే.. విజయానికి అవసరమైన మెజార్టీ రాకపోవటంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును షురూ చేశారు. ఈ ఓట్ల లెక్కింపు శుక్రవారం తెల్లవారుజాము వరకు సాగింది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు.

ఈ ఎన్నికల్లో మొత్తం 21 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. వీరిలో మొదటి ప్రాధాన్యత ఓట్లలో అత్యధికంగా బీజేపీ బలపర్చిన ఏవీఎన్ రెడ్డికి 7505 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ బలపర్చిన చెన్నకేశవరెడ్డికి 6584 ఓట్లు వచ్చాయి. యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డికి 4569 ఓట్లు వచ్చాయి. మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జానర్థన్ రెడ్డికి అతి తక్కువగా 1236 ఓట్లు రావటం గమనార్హం. ఆయనకంటే అధికంగా హర్షవర్ధన్ రెడ్డికి 1907 ఓట్లు వచ్చాయి.

బరిలో నిలిచిన త్రిపురారి అనంత నారాయణ్ అనే అభ్యర్థికి ఒకే ఒక్క ఓటు రావటం విశేషం. ఈ ఎన్నిక ఫలితం అధికారపక్షంపై ఉపాధ్యాయ వర్గాల్లో ఉన్న ఆగ్రహాన్ని తెలియజేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఎన్నికలకు కొన్ని నెలలే ఉన్న వేళలో జరిగిన ఈ ఎన్నిక అధికార పక్షానికి ఇబ్బందికరంగా మారుతుందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.

మహబూబ్‌నగర్, రంగారెడ్డి మరియు హైదరాబాద్ జిల్లల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన @BJP4Telangana #MLC అభ్యర్థి శ్రీ #AVNReddy గారికి హృదయపూర్వక అభినందనలు.👆ఇదే " తెలంగాణ ప్రజలు " ఇచ్చే తీర్పు.
కల్వకుంట్ల కుటుంబ చెర నుండి తెలంగాణ విముక్తి కి అడుగులు పడుతున్నయ్. pic.twitter.com/6ycDP8jBi1

— Mahender Chowkidhar (@Kolla_Mahender) March 17, 2023

Tags: AVN Reddybandi sanjayBJPbrsKCRmlc electionsTelangana
Previous Post

వైసీపీకి షాకిచ్చిన ఓటర్లు… మార్పు మొదలైంది

Next Post

ట్రెండవుతున్న #ByeByeJaganIn2024

Related Posts

ys jagan
Andhra

బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?

March 21, 2023
revanth
Politics

తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట

March 21, 2023
kcr speech
Telangana

కేసీఆర్ ధీమా వెనుక

March 21, 2023
Top Stories

వివేకా కేసులో ఒకే రోజు రెండు ట్విస్ట్ లు

March 20, 2023
Trending

ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్

March 20, 2023
Trending

అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు

March 20, 2023
Load More
Next Post
byebyejagan

ట్రెండవుతున్న #ByeByeJaganIn2024

Latest News

  • బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?
  • తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట
  • కేసీఆర్ ధీమా వెనుక
  • వివేకా కేసులో ఒకే రోజు రెండు ట్విస్ట్ లు
  • ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్
  • అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు
  • ద‌స్త‌గిరి బెయిల్ ర‌ద్దు చేయండి: వివేకా కేసులో యూట‌ర్న్‌
  • రేవంత్ దెబ్బకు ప్రగతిభవన్ ఉక్కిరిబిక్కిరి
  • ఒత్తిడికి తలొంచక తప్పలేదా?
  • బీఆర్ఎస్ లో ఈ హడావుడి ఎందుకో తెలుసా ?
  • జగన్ పతనానికి ఈ ఫలితాలే నాంది: లోకేష్
  • ఓటమిపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ సభ్యుల ఘర్షణ
  • 3…  చూడ్డానికే మూడే కానీ YCP కి మూడినట్లే
  • చంద్ర‌బాబు వైరల్ కామెంట్స్‌

Most Read

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

శ్రీకాంత్ కొడుకు… ఒకేసారి రెండు

ఆస్కార్ గెలిచిన ‘ది ఎలిఫెంట్ విప్సరర్స్’ సంగతేంటి?

బెల్లంకొండ ఏంటి ఇంత పెద్ద షాకిచ్చాడు !

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

జ‌న‌సేన‌ : ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌కు ప‌వ‌న్ ఆహ్వానం

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra