కడప జిల్లా పులివెందులలోని 2018లో పూల అంగళ్ల వద్ద జరిగిన అల్లర్ల కేసును పోలీసులు తిరగతోడారు. నాడు చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ వైసీపీ ఇరువర్గాల నేతలపై కేసు నమోదు చేయించింది. అప్పట్లో బీటెక్ రవి కూడా అరెస్టయ్యారు. తర్వాత విడుదల అయ్యారు.
ఇపుడు పోలీసులు మళ్లీ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు.
2018 నాటి ఘర్షణ కేసులో బీటెక్ రవిని అరెస్ట్ చేసినట్టు చెప్పిన కడప ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. ఈ కేసులో పలువురు బెయిలుపై ఉన్నారు. ఇదిలా ఉండగా… ఇటీవల మండలిలలో జరిగిన దానిని గుర్తుపెట్టుకుని బీటెక్ రవిని టార్గెట్ చేశారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.
తన అరెస్టు విషయంలపై పోలీసుల తీరుపై బీటెక్ రవి మండిపడ్డారు. నేను ఏమైనా అంతర్జాతీయ నేరస్తుడినా? వెంటాడి పట్టుకుంటారా? స్టేషన్కు రమ్మంటే తానే వచ్చే వాడినని పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 2018లో కేసు నమోదైతే ఇప్పటి వరకు పోలీసులు నిద్రపోతున్నారా? అని రవి ప్రశ్నించారు.