ప్రజాస్వామ్యం మొదటి లక్షణం… ప్రజలు తమకోసం పనిచేసే వారిని ఎన్నుకోవాలనేదే. కానీ నేటి నేతలు… మీ కోసం పనిచేస్తాం అని ఎన్నికల ముందు దేవుళ్ల మీద ఒట్టేసి హామీలు ఇస్తారు. అమాయక జనం దేవుడు మీద ఒట్టేశాడని, మంచి మాట్లాడాడు అని… మా సమస్యలు తీరుస్తాం అని చెప్పాడు అని ఓట్లు వేస్తుంటే… వారికి తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు. గెలిచాక వారి మొహం చూడ్డానికి కూడా వారు ఇష్టపడటం లేదు.
అలాంటి నేతల్లో ఒకరైన సాలూరు వైసీపీ ఎమ్మెల్యే రాజన్న దొర… అనుకోకుండా జనానికి చిక్కాడు. ఇక వారు ఆయన్ను ఒకాటాడుకున్నారు. చీపురువలస గ్రామం మీదుగా వెళ్తున్న ఎమ్మెల్యే రాజన్న దొర వాహనాన్ని స్థానికులు అడ్డుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమ ప్రాంతానికి ఒక్కసారి కూడా రాలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు ఇటు వెళ్తున్నపుడైనా కనీసం పట్టించుకోకుండా వెళ్తావా అంటూ ఆపి నిలదీశారు.తమ గ్రామంలో మౌలిక వసతులు, రోడ్డు సౌకర్యం లేదని, ఇంతవరకు ఎందుకు కల్పించలేదంటూ నిలదీశారు. దాంతో పాటు గ్రామస్థులంతా తమ సమస్యలు ఏకరువు పెట్టడంతో కోపంతో ఊగిపోయిన ఎమ్మెల్యే రాజన్న దొర. నన్నే నిలదీస్తారా… ‘ఇక మీ గ్రామానికి ఎప్పుడూ రాను.. మీరే ఇబ్బంది పడతారు’ అని మండిపడ్డారు. దీంతో జనానికి మండిపోయింది. ఆగ్రహం చెందిన గ్రామస్థులు నిరసన తెలిపారు. ఓట్లేసి గెలిపిస్తే మమ్మల్నే బెదిరిస్తావా అంటూ…. ఎమ్మెల్యే రాజన్న దొర వాహనాలను కదలకుండా రోడ్డుపై ధర్నా చేశారు. చివరికి గ్రామానికి రోడ్డు వేయిస్తానని ఎమ్మెల్యే రాజన్న దొర హామీ ఇవ్వడంతో గ్రామస్థులు శాంతించారు. ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా రోడ్డుపై మంటలు వేసి గ్రామానికి చెందిన యువకులు నిరసన తెలిపారు.
ఇంతకాలం ప్రజలకు మొహం చాటేసిన ఎమ్మెల్యే వారిని శాంతింపజేయకుండా ఆగ్రహం వ్యక్తంచేయడం ఏంటి… పాలకులకు ఇంత అహంకారమా? ప్రజలు ఊడబీకాలనుకుంటే రోడ్డున పడే జీవితాలు వీళ్లవి. తర్వాత దేహీ అని పరాయి పార్టీల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ప్రజలకు కోపం తెప్పించినవాడు ప్రజాస్వామ్యంలో బతికబట్టకట్టడు.