వైసీపీ అధికార ప్రతినిధి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు గురించి తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో టచ్ ఉన్న వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. విషయం ఏదైనా…తమ పార్టీ డిఫెన్స్ లో ఉన్నా సరే…తనదైన మాటకారితనం, చమత్కార ధోరణితో తిమ్మిని బమ్మిని చేయడంలో అంబటిది అందెవేసిన చెయ్యిని ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్ ఉంది. అయితే, అదే రీతిలో మహిళలకు సంబంధించిన వివాదాల్లో, లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడంలోనూ గతంలో అంబటి పేరు పలుమార్లు వినిపించింది.
ఈ క్రమంలోనే తాజాగా అంబటి మాట్లాడినట్లుగా ప్రచారం జరుగుతోన్న ఆడియో టేప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ మహిళతో అంబటి మాట్లాడినట్లు, ఆ వాయిస్ ఆయనదేనని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గుంటూరుకు చెందిన ఓ మహిళతో అంబటి ఫోన్ లో మాట్లాడినట్లుగా, తనకు మసాజ్ చేసేందుకు అమ్మాయి కావాలని అడిగినట్లుగా చెబుతున్న ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
మసాజ్ ఒక్కటే చేస్తుందా? ఇంకేం చేయదా? అని అంబటి అడగ్గా…. మీకేం కావాలో అన్నీ చేస్తుందంటూ..సదరు మహిళ జవాబిచ్చింది. ఆ మసాజ్ చేసే మహిళను తన ఊరికే పంపాలని అంబటి కోరగా.. అంబటిని గుంటూరుకు వస్తారా అని ఆ మహిళ ప్రశ్నించింది. అయితే, తన ఊరికే పంపాలని, అద్దె ఇల్లు పెద్దగా ప్రాబ్లమేమీ రాదంటూ అంబటి ఆమెకు భరోసా ఇచ్చినట్టు ఆ ఆడియో టేప్ లో ఉంది. తనకు మసాజ్ చేసే అమ్మాయి ఎవరు, వయసెంత? చెప్పినవన్నీ చేస్తుందా? బాగుంటుందా? అంటూ అంబటి కొంటె ప్రశ్నలు వేసినట్లు ఆ ఆడియో టేప్ లో ఉంది.
అయితే, అంబటిపై ఈ తరహా ఆరోపణలు రావడం ఇది తొలిసారి కాదు. గతంలో ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కు వచ్చిన ఓ మహిళ.. అంబటిపై సంచలన ఆరోపణలు చేశారు. అప్పట్లో ఆ వ్యవహారం పెను సంచలనం రేపింది. అయితే అదే మహిళను వేరే ఛానల్ కు రప్పించగలిగిన అంబటి.. అదే మహిళతో అసలు విషయం ఇదేనంటూ చెప్పించి దాని నుంచి ఎస్కేప్ అయ్యారు. మరి, ఇపుడు అధికార పార్టీ అండ ఉన్న అంబటి…ఆ వాయిస్ తనది కాదని, ఆ టేప్ వివాదం నుంచి కూడా సులువుగా బయటపడతారా…లేక ఇరుక్కుంటారా అన్నది తేలాల్సి ఉంది.