మంత్రి నారా లోకేష్.. తన నియోజకవర్గం మంగళగిరిపై ఎవరూ చెరపలేనంతగా ముద్ర వేస్తున్నారా? సు స్థిర స్థాయిలో ఆయన ఇక్కడే పాగావేయాలని నిర్ణయించుకున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరి శీలకులు. తాజాగా ఆయన వేసిన అడుగులు.. గత కొన్నిదశాబ్దాలుగా ఉన్న డిమాండ్‌ను నెరవేర్చాయి. మంగళగిరి నియోజకవర్గంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఉన్నా.. తమకు మెరుగైన వైద్యం అందడం లేదని ఇక్కడివారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీనిని గమనించిన నారా లోకేష్.. గత ఎన్నికల సమయంలో తాను గెలిస్తే.. మంగళగిరిలో 100 పడకల ఆ సుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే తాజాగా ఆదివారం నారా లోకేష్.. ఆసుపత్రి నిర్మాణా నికి శంకు స్థాపన చేశారు. దీనిని ఏడాది కాలంలో పూర్తి చేయనున్నారు. తద్వారా.. నియోజకవర్గం నుంచి రోగులు ఇతర ప్రాంతాలకు ముఖ్యంగా విజయవాడకు రావాల్సిన అవసరం తప్పనుంది. ఇది నిజానికి నారా లోకేష్ నియోజకవర్గ రాజకీయాల్లో మైలురాయిగా మారనుంది.
ఇక, ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని కూడా.. నారా లోకేష్ అమలు చేస్తున్నారు. ప్రభుత్వ స్థ లాల్లో ఇళ్లను నిర్మించుకున్న నిరుపేదలకు వాటిని క్రమబద్దీకరిస్తూ.. శాశ్వత ఇంటి పట్టాలు అందిస్తున్నా రు. ఈ సమస్య కూడా ఎప్పటి నుంచో ఉంది. దీనిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలని చానాళ్ల నుం చి డిమాండ్ ఉన్నా.. ఎవరూ పట్టించుకోలేదు. ఈ విషయాన్ని గత ఎన్నికల సమయంలో ప్రస్తావించిన నారా లోకేష్ కేవలం 10 మాసాల్లోనే దీనిని కూడా అమలు చేస్తున్నారు.
ఇక, అంతర్గత రహదారుల నిర్మాణంతోపాటు చేనేతలకు ఆసరా కల్పిస్తున్నారు. ఒకప్పుడు మంగళగిరి చేనేత వస్త్రాలుఎక్కడో కానీ దొరికేవి కాదు. కానీ.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏ బట్టల దుకాణానికి వెళ్లినా.. మంగళగిరి చేనేత వస్త్రాలు ఇబ్బడిముబ్బడిగా దర్శనమిస్తున్నాయి. తద్వారా.. చేనేత వస్త్రాలకు మంచి మార్కెట్ కూడా లభించింది. ఇది స్థానికంగా ఉన్న చేనేతలకుఎంతో మేలు చేస్తోంది. ఇలా.. చిన్న విషయాలను సైతం చాలా కీలకంగా తీసుకుంటూ.. ముందుకు సాగుతున్న నారా లోకేష్ నియోజకవర్గంపై చెరగని ముద్ర వేస్తున్నారని చెప్పడం అతిశయోక్తి కాదు.