ఖజానాలో కాసులున్నా లేకున్నా….ఏపీలో తాను చేపట్టిన సంక్షేమ పథకాలను సీఎం జగన్ అమలు చేసేందుకు ప్రయత్ని్తున్న సంగతి తెలిసిందే. ఓ పక్క పన్నులు పెంచుతూ…మరో పక్క పథకాల రూపలంలో తాయిలాలు ఇస్తూ….ప్రజలను జగన్ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే జగన్ పథకాలలో ఒక దానిని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫాలో కాబోబతున్నారు. ఏపీలో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ అందించే పథకాన్ని కేటీఆర్ తెలంగాణలో కూడా అమలు చేయబోతున్నారట. ఇందుకోసం ఏర్పాటు చేసిన తెలంగాణ ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టును త్వరలో కేటీఆర్ పూర్తి చేయబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలోనూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంటింటికి అందించాలని కేసీఆర్ సర్కార్ యోచిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఇంటింటికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే ఇటు విద్యార్థులకు…అటు ఉద్యోగులకు ఉపయుక్తంగా ఉంటుందని కేటీఆర్ అనుకుంటున్నారట. టెక్నాలజీ, డిజిటల్ సౌకర్యాలు అందించడంలోనూ తెలంగాణ పురోగమించాలని కేటీఆర్ ఆకాంక్షించారు. సామాన్యులకూ టెక్నాలజీని అందుబాటులోకి తేవాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని కేటీఆర్ అన్నారు. త్వరలోనే డ్రోన్లతో మారుమూల ప్రాంతాలకు ఔషధాలను చేరవేసే ప్రాజెక్టులను ప్రభుత్వం అమలు చేస్తోందని కేటీఆర్ తెలిపారు.దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ నుంచి కేటీఆర్ పాల్గొన్నారు.’భారత్‌లో నూతన సాంకేతికతకు ప్రోత్సాహం’ అనే అంశంపై జరిగిన సందర్భంగా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.