సంతానం ... విశ్వరూపం చూపిస్తాడిక

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.. గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన సర్ప్రైజ్ హిట్లలో ఇది ఒకటి. పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు తెరపై కనిపించిన బొమ్మ చూసి ఆశ్చర్యపోయారు. ఫిదా అయిపోయారు. కేవలం మౌత్ టాక్‌‌తో ఈ సినిమా ఆడేసింది.

అంతకుముందు చిన్నా చితకా పాత్రలే చేసిన నవీన్ పొలిశెట్టికి ఈ చిత్రంతో మంచి బ్రేకే వచ్చింది. ఒక్కసారిగా అతడి పాపులారిటీ పెరిగింది. అవకాశాలూ వచ్చి పడ్డాయి. స్వరూప్ ఆర్.జె అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. నవీన్ సైతం దీని స్క్రిప్టులో పాలుపంచుకున్నాడు.

ఈ సినిమా ఇతర భాషల వాళ్లనూ ఆకర్షించింది. తమిళం, హిందీ, కన్నడ భాషల్లో దీని రీమేక్ హక్కులు అమ్ముడవడం విశేషం. ముందుగా తమిళంలో ఈ చిత్ర రీమేక్ సెట్స్ మీదికి వెళ్లబోతోంది.కమెడియన్ టర్న్డ్ హీరో సంతానం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ తమిళ వెర్షన్లో కథానాయకుడిగా నటించనున్నాడు.

ఒకప్పుడు కమెడియన్‌గా ఒక వెలుగు వెలిగిన సంతానం.. తర్వాత సునీల్ మాదిరే హీరోగా మారాడు. ఐతే హీరోగా అతడి ప్రస్థానం రెండు మూడు సినిమాలతో ఆగిపోలేదు. పదేళ్లుగా హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. మధ్య మధ్యలో మంచి హిట్లు కూడా పడ్డాయి. ఇప్పుడు కూడా కథానాయకుడిగా మూణ్నాలుగు సినిమాలు అతడి చేతిలో ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రీమేక్ అతడి చేతికి వచ్చింది.

ఇంతకుముందు నాని సినిమా ‘మజ్ను’లో ఓ కథానాయికగా నటించిన రియా సుమన్ ఇందులో కథానాయికగా నటించనుంది. ‘వంజగర్ ఉలగం’ అనే హిట్ థ్రిల్లర్ తీసిన మనోజ్ బీద ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. సంతానం శైలికి ఈ సినిమా బాగా సూటవుతుందని భావిస్తున్నారు. మంచి విషయం ఉన్న కథ కావడంతో తమిళంలోనూ ‘ఏజెంట్’ హిట్టయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.