• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఏపీ లో వాలంటీర్లకు ప్ర‌భుత్వం బిగ్ షాక్‌.. ఇక వారితో ప‌ని లేన‌ట్లే!

admin by admin
June 18, 2024
in Andhra, Politics, Trending
0
0
SHARES
513
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ లో గత వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు, సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్లను నియమించారు. ప్రజలకు సంక్షేమ పథకాలను డోర్ టు డోర్ అందించేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ అనేది ఎంతో కీలకంగా మారింది. ఒకానొక సమయంలో ఏపీ రాజకీయాలు వాలంటీర్ల వ్యవస్థ చుట్టూనే తిరిగింది. వాలంటీర్లు లేకపోతే ప్రభుత్వమే లేదన్న హైప్ తీసుకొచ్చారు. 

అయితే ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఎటువంటి బాధ్యత అప్పగించకూడదని ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సుమారు లక్ష మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేయడమే కాకుండా వైసీపీ మరియు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరపున ప్రత్యక్షంగా ప్రచారం చేశారు.  సీన్ కట్ చేస్తే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి బ్రేకులు పడ్డాయి. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది.

దీంతో వాలంటీర్ల వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ముందు వాలంటీర్లను రాజీనామా చేయొద్దని కూటమి అభ్యర్థులు కోరారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పది వేలు గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. అయినా సరే వినలేదు. ఇప్పుడేమో వైసీపీ నేతలు బలవంతంగా త‌మ చేత రాజీనామాలు చేయించారంటూ కొంద‌రు వాలంటీర్లు  పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తిరిగి ఉద్యోగాలు వచ్చేలా చూడమంటూ అభ్యర్థిస్తున్నారు.

ఇలాంటి త‌రుణంలో రాజీనామా చేసిన వాలంటీర్లకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. తాజాగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు పై మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేసిన వాలంటీర్లతో ఇక పని లేదని.. వారిని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోమని స్పష్టం చేశారు. ఉన్న వాలంటీర్లతోనే పనిచేయించుకుంటామని పేర్కొన్నారు. జులై 1వ తేదీన లబ్ధిదారులకు ఇంటి దగ్గరే వాలంటీర్ల ద్వారా పెన్ష‌న్ పంపిణీ చేస్తామని తెలిపారు. వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని వాలంటీర్ల నుంచి పెద్ద ఎత్తున‌ మెయిల్స్, ఫోన్ కాల్స్ వ‌స్తున్నాయ‌ని.. అయినాస‌రే వారిని తిరిగి తీసుకునే అవ‌కాశాలు లేవ‌ని మంత్రి డోలా తెలిపారు.

Tags: Andhra PradeshapAP Newsap politicsDola Bala Veeranjaneya SwamyEx VolunteersLatest newsMinister Bala Veeranjaneya SwamyResigned VolunteersTDPYRSCPYS Jagan Mohan Reddy
Previous Post

తేజస్విని సినిమాల్లోకి వ‌చ్చుంటే అదే జ‌రిగేది: శ్రీ భ‌ర‌త్‌

Next Post

అమెరికా లోని లాస్ ఏంజెలెస్ లో NDA కూటమి విజయోత్సవ వేడుకలు!

Related Posts

Andhra

టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!

May 19, 2025
Movies

మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!

May 19, 2025
Andhra

విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Andhra

మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?

May 18, 2025
Andhra

కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత

May 18, 2025
Load More
Next Post

అమెరికా లోని లాస్ ఏంజెలెస్ లో NDA కూటమి విజయోత్సవ వేడుకలు!

Latest News

  • టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!
  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra